Latest Updates
-
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం -
అమెరికాలో చీప్,భారత్ లో కాస్ట్లీ : ఇండియాలోనే తయారవుతున్నా..ఐఫోన్ల ధరలు ఎందుకు మండిపోతున్నాయి? -
ఉద్యోగులకు అలర్ట్..మీ గుండెను దెబ్బతీస్తున్న 4 ప్రధాన కారణాలివే! -
స్వీట్ షాప్ స్టైల్ మలై బర్ఫీ..ఈ సింపుల్ రెసిపీ తెలిస్తే ఇకపై బయట కొనరు! -
అంగారకుడి నీచ సంచారం.. ఈ 4 రాశుల వారు కళ్లు తెరిచి ఉండకపోతే పక్కాగా నష్టపోతారు! -
పెళ్లిళ్లలో ఇది లేకుండా భోజనం పూర్తి కాదు.. నోరూరించే ఆంధ్రా స్టైల్ గోంగూర శనగపప్పు పులుసు.!
కుప్పకూలిన బంగారం ధరలు.. !!
దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ప్రారంభ ట్రేడింగ్ లో కుప్పకూలాయి. స్పాట్ మార్కెట్‌లో డిమాండ్ మందగించడంతో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో పసిడి ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. 10 గ్రాముల బంగారం 0.69 శాతం మేర తగ్గింది. 1,54,820 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. చివరి ట్రేడింగ్ సెషన్ తో పోల్చుకుంటే 3,000 రూపాయలకు పైగా బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. అదే విధంగా వెండి రేటు కూడా పడిపోయింది. 3.07% తగ్గి 2,36,851 వద్ద స్థిరపడింది.
మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో స్పాట్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,56,500కి చేరగా, 22 క్యారెట్ల బంగారం రూ. 1,43,400 పలుకుతోంది. దేశంలోని ప్రధాన నగరాలలో ధరలు విభిన్నంగా ఉన్నాయి. ఢిల్లీ, జైపూర్‌లలో 22 క్యారెట్ల బంగారం 1,43,100 రూపాయలు, 24 క్యారెట్లు 1,56,000గా రూపాయలుగా నమోదయ్యాయి. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 1,43,300, 24 క్యారెట్ల బంగారం రూ.1,56,000కు చేరింది.

పూణే, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో 22 క్యారెట్లకు రూ. 1,43,400, 24 క్యారెట్లకు రూ. 1,56,500 వసూలు చేస్తున్నారు. కిందటి నెలలో బంగారం ధర పది గ్రాములకు రూ.1,80,000 మించిన విషయం తెలిసిందే. ఇది ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిని తాకింది. వెండి ధర కూడా కిలో రూ. 4,20,000తో రికార్డు స్థాయికి చేరింది. దీని తర్వాత ఈ రెండింటి రేట్లూ తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దిగుమతి సుంకాలు, పన్నులు, మారకపు రేట్లలో హెచ్చుతగ్గులు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,753, 22 క్యారెట్లు - రూ. 14,440, 18 క్యారెట్లు - రూ. 12,350
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,644, 22 క్యారెట్లు- రూ. 14,340, 18 క్యారెట్లు - రూ. 11,733
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,644, 22 క్యారెట్లు- రూ. 14,340, 18 క్యారెట్లు - రూ. 11,733
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,644, 22 క్యారెట్లు- రూ. 14,340, 18 క్యారెట్లు - రూ. 11,733
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,644, 22 క్యారెట్లు- రూ. 14,340, 18 క్యారెట్లు - రూ. 11,733
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,644, 22 క్యారెట్లు- రూ. 14,340, 18 క్యారెట్లు - రూ. 11,733
Credit: Oneindia



Click it and Unblock the Notifications
