బంగారం ధరల్లో హ్యూజ్ క్రాష్: ఊగిసలాటలో..!!

By Chandrasekhar Rao

అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న దిద్దుబాటు ప్రభావంతో భారత్‌లో బంగారం, వెండి ధరలు గణనీయంగా పడిపోయాయి. రెండు రోజుల ర్యాలీ అనంతరం లాభాల స్వీకరణ పెరిగింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా మెటల్ ధరలు పతనం అయ్యాయి. దీని ప్రభావం పసిడి- వెండిపై పడింది.. ఈ క్షీణత చోటుచేసుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ 1.27 శాతం తగ్గి 1,50,147 రూపాయలకు చేరింది.

వెండి ఫ్యూచర్స్ అయిదు శాతం పతనం అయ్యాయి. 2,31,500 రూపాయల వద్దకు దిగివచ్చాయి. గత ఏడాదిగా దూసుకుపోతున్న ఈ కమోడిటీల జోరుకు ఇక బ్రేక్ పడినట్టయింది. అదే సమయంలో కామెక్స్ మార్కెట్‌లో వెండి ఫ్యూచర్స్ ఒక ఔన్స్‌కు 70 డాలర్ల దిగువకు పడిపోయింది. గురువారం నాటితో పోల్చుకుంటే ఇది 10 శాతం వరకు క్షీణించింది. ఆపై స్వల్పంగా కోలుకుంది. గత రెండు రోజుల్లో- వెండి రేట్లు 20 శాతానికి పైగా తగ్గాయి. ఇది హై-లివరేజ్ పొజిషన్లల్లో భారీ అమ్మకాలకు అద్దం పట్టింది.


Gold Rates Tumble 2 Percent on MCX on Global Correction and profit booking amid weak global cues

కామెక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 1.20 శాతం మేర తగ్గి ఔన్స్‌కు 4,831 డాలర్లకు చేరుకుంది. అయిదు రోజుల్లో ఔన్స్‌ ధర గరిష్ఠంగా 5,045 డాలర్ల నుండి భారీగా తగ్గింది. దాదాపుగా 200 డాలర్లే మేర తగ్గడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది పెట్టుబడిదారులలో ఆందోళనలను పెంచింది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీ, జైపూర్‌లో రూ. 1,41,690, అహ్మదాబాద్, పుణెలో రూ. 1,41,590, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలలో రూ. 1,41,540గా నమోదైంది. ఇదే నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ. 1,54,560, రూ. 1,54,460, రూ. 1,54,410కి చేరాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,404, 22 క్యారెట్లు - రూ. 14,120, 18 క్యారెట్లు - రూ. 12,100

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు - రూ. 11,426

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు- రూ. 11,426

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు- రూ. 11,426

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు- రూ. 11,426

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు- రూ. 11,426

Credit: Oneindia

Desktop Bottom Promotion