బంగారం ధరలు సడన్‌గా ఎందుకు కుప్పకూలాయి.. కొనుగోలుకు ఇది సరైన సమయమేనా.. నిపుణులు సూచన ఏంటంటే..

By Borra Hazarathaiah

బంగారం రేట్లు భారీగా పతనమవుతున్నాయి. డాలర్ పుంజుకోవడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. దీంతో బంగారం ధరలకు రెక్కలు విరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా మారినప్పుడల్లా బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో కొంత శాంతియుత పరిస్థితులు కనిపించడంతొ మళ్లీ డాలర్ తో వ్యాపారం పెరిగింది. దీంతో సామాన్యులు కూడా Gold కొనే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలా లేక వాయిదా వేసుకోవాలని అనేదానిపై పలువురు నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.

అమెరికా ఉద్యోగాల గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు విధానంపై పెరుగుతున్న అనిశ్చితి నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరలు శుక్రవారం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.


1 55 gold price today gold rate today gold investment should you buy gold now gold price forecast gold price Rs 1 55 lakh gold market today gold safe haven asset gold price in India gold price outlook gold price volatility long term gold investment MCX gold price international gold price spot gold price gold after early losses gold buying opportunity gold vs inflation federal reserve rates impact on gold safe investment options
Photo Credit:

ఫిబ్రవరి 13న ప్రారంభ ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్‌లో కామెక్స్‌పై Gold ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. ఔన్సుకు 5,089 డాలర్ల వద్ద ఉన్న ధర 4,911 డాలర్ల వరకు క్షీణించింది. అయితే ఆ తరువాత కొంతమేర కోలుకుని ప్రస్తుతం ఔన్సుకు సుమారు 5,006 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది గత ముగింపు ధరతో పోలిస్తే దాదాపు 1.18 శాతం లాభాన్ని సూచిస్తోంది.

దేశీయ మార్కెట్‌లో.. శుక్రవారం సెషన్‌లో MCXలో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,579 వద్ద ప్రారంభమైంది. ఇది మునుపటి ముగింపు ధరతో పోలిస్తే సుమారు 1.14 శాతం పెరుగుదల. అయితే, గురువారం సెషన్‌లో బంగారం ధరలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ఆ రోజు 10 గ్రాముల ధర రూ.1,52,300 వద్ద రెడ్‌లో ముగిసింది. ఇది సుమారు 4.07 శాతం పతనాన్ని సూచిస్తుంది.

ఇదే సమయంలో అంతర్జాతీయ బులియన్, జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకటించిన సాయంత్రం 6:30 గంటల రేటు ప్రకారం..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రామాణిక ధర రూ.1,55,650గా నిర్ణయించారు. ఇది గత 24 గంటల్లో నమోదైన రూ.1,57,322తో పోలిస్తే సుమారు 1.06 శాతం తగ్గుదలగా ఉంది.

బంగారం, వెండి ధరల పెరుగుదలపై షాకింగ్ అంచనాలు.. స్టాప్ లాస్ మీద నిపుణులు కీలక సూచన ఇదిగో..

కరెన్సీ మార్కెట్‌లో డాలర్ ఇండెక్స్ 96.82 స్థాయిల వద్ద స్థిరంగా ఉండగా, రూపాయి డాలర్‌తో పోలిస్తే స్వల్పంగా బలపడింది. రూపాయి 0.08 పైసలు లేదా 0.09 శాతం లాభంతో 90.57 వద్ద ట్రేడవుతోంది. అమెరికాలో విడుదలైన వ్యవసాయేతర పేరోల్స్ డేటా అంచనాల కంటే బలంగా ఉన్నప్పటికీ, డాలర్ సూచికలో పెద్దగా బలం కనిపించలేదు. ఇది రూపాయికి కొంత మద్దతునిచ్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

బంగారం ధరలు స్వచ్ఛత, నగరం, స్థానిక పన్నులు, ఆభరణాల మార్జిన్లు మరియు లాజిస్టిక్స్ ఖర్చులపై ఆధారపడి స్వల్పంగా మారుతూ ఉంటాయి. అయినప్పటికీ, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు దాదాపు ఏకరూపంగా కొనసాగుతున్నాయి.

బంగారం ధరలు ఎందుకు తగ్గాయి? పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయమేనా అనే ప్రశ్న ఇప్పుడు ఇన్వెస్టర్లను ఆలోచింపజేస్తోంది. LKP సెక్యూరిటీస్ కమోడిటీ & కరెన్సీ విభాగం వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది ప్రకారం.. అమెరికా ఉద్యోగాల డేటా బలంగా రావడంతో ఫెడరల్ రిజర్వ్ త్వరగా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం తగ్గింది. దీనివల్ల బులియన్ మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది.

సాంకేతికంగా చూస్తే.. కామెక్స్ గోల్డ్‌కు 5,025 డాలర్ల వద్ద మద్దతు ఉండగా, 5,090 డాలర్ల నుంచి 5,110 డాలర్ల మధ్య నిరోధం (కొనుగోలు ఆపే స్థాయి) కనిపిస్తోంది. MCXలో రూ.1,56,000 దగ్గర కీలక మద్దతు, రూ.1,60,000 వద్ద ప్రధాన నిరోధ స్థాయిగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు మార్కెట్ దృష్టి మొత్తం అమెరికా CPI డేటాపైనే ఉంది. ఈ డేటా బంగారం ధరలకు తదుపరి దిశను నిర్ణయించగలదని అంచనా వేస్తున్నారు.

జనవరిలో అమెరికాలో ఉద్యోగ వృద్ధి అంచనాలకు మించి ఉండటంతో పాటు నిరుద్యోగిత రేటు 4.3 శాతానికి తగ్గింది. ఇది కార్మిక మార్కెట్ బలంగా ఉందనే సంకేతాన్ని ఇస్తోంది. అయితే మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీస్ అనలిస్ట్ మానవ్ మోడీ ప్రకారం.. గత డేటాలో జరిగిన సవరణలు ఉద్యోగాల వృద్ధిపై సందేహాలు కలిగిస్తున్నాయి. దీంతో బంగారం ధరల్లో మార్పులు సంభవించవచ్చని చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Credit: Goodreturns

Story first published: Saturday, February 14, 2026, 7:50 [IST]
Desktop Bottom Promotion