Latest Updates
-
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు!
Gold Rates: రికార్డ్ స్థాయిలో బంగారం ధరలు! వరుసగా నాలుగో రోజు పెరిగిన ధర.. ఇప్పుడు కొనడం మంచిదేనా?
బంగారం అంటే భారతీయులకు ఎంతో సెంటిమెంట్. అయితే ప్రస్తుతం ఆ సెంటిమెంట్‌కు ధరల సెగ తగులుతోంది. గత నాలుగు రోజులుగా భారత మార్కెట్లో బంగారం ధరలు (Gold Rates) దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉండటంతో పెట్టుబడిదారులు పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల దేశీయంగా కూడా ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి.
నేడు శుక్రవారం (డిసెంబర్ 26), దేశవ్యాప్తంగా బంగారం ధరలు అన్ని కేటగిరీలలోనూ గణనీయంగా పెరిగాయి. అసలు మన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

నేటి తాజా ధరలు (1 గ్రాముకు)..
- 24 క్యారెట్ల బంగారం: దీనిని అత్యంత స్వచ్ఛమైన బంగారంగా భావిస్తారు. ప్రధానంగా ఇన్వెస్ట్‌మెంట్ కోసం వాడే ఈ బంగారం ధర నేడు గ్రాముకు రూ.14,002 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.77 పెరిగింది.
- 22 క్యారెట్ల బంగారం: ఆభరణాల తయారీలో ఎక్కువగా వాడే ఈ పసిడి ధర నేడు గ్రాముకు రూ.12,835 గా ఉంది. ఇది రూ.70 మేర పెరిగింది.
- 18 క్యారెట్ల బంగారం: చిన్న చిన్న ఆభరణాల కోసం వాడే ఈ కేటగిరీ ధర రూ.58 పెరిగి రూ.10,502 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో Gold Rates (1 గ్రాముకు)..
మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో ధరలు ఒకే రకంగా ఉన్నాయి.
- హైదరాబాద్: రూ.14,002 (24k), రూ.12,835 (22k)
- విజయవాడ: రూ.14,002 (24k), రూ.12,835 (22k)
- చెన్నై: ఇక్కడ ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. రూ.14,062 (24k), రూ.12,890 (22k)
- ముంబై & బెంగళూరు: రూ.14,002 (24k), రూ.12,835 (22k)
ఎందుకీ పరుగు? మున్ముందు ఎలా ఉండబోతోంది?
బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. మార్కెట్ ఒడిదుడుకుల సమయంలో ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు వెళ్లడం వల్ల డిమాండ్ పెరుగుతుంది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 'గోల్డ్ మాన్ సాక్స్' (Goldman Sachs) నివేదిక ప్రకారం.. దాదాపు 70 శాతం మంది గ్లోబల్ ఇన్వెస్టర్లు వచ్చే ఏడాదిలో బంగారం ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు తగ్గుతాయని ఆశించడం కంటే దీర్ఘకాలిక అవసరాల కోసం ఇప్పుడే ప్లాన్ చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
వెండి సునామీ: గోల్డ్‌ను మించిన రిటర్న్స్!
ఇకపోతే వెండి మాత్రం ఎవ్వరికీ అందనంత ఎత్తుకు చేరుకుంటోంది. ఈ ఏడాది వెండి ధరల పెరుగుదల ఏకంగా 150 శాతం దాటిపోవడం విశేషం. అంటే బంగారం కంటే వెండిలోనే పెట్టుబడిదారులకు రెట్టింపు లాభాలు వచ్చాయి. అమెరికా ప్రభుత్వం వెండిని తన 'కీలక ఖనిజాల' (Critical Minerals) జాబితాలో చేర్చడం, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వాడకం పెరగడం దీనికి ప్రధాన కారణం. భారతీయ కమోడిటీ మార్కెట్ (MCX) లో కూడా వెండి సరికొత్త చరిత్ర సృష్టించింది. శుక్రవారం మార్కెట్ ప్రారంభంలోనే వెండి ఫ్యూచర్స్ ధర దాదాపు 4 శాతం పెరిగి, కిలోకు రూ.2,54,000 వద్ద ఆల్-టైమ్ రికార్డ్‌ను తాకింది. ఇన్వెస్టర్లను ఇది ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇక పెట్టుబడి విషయానికొస్తే.. పెరుగుతున్న బంగారం ధరలు (Gold Rates) చూస్తుంటే మధ్యతరగతి వారికి ఆభరణాలు కొనడం కాస్త కష్టంగానే మారేలా ఉంది. మీరు ఒకవేళ పెట్టుబడి పెట్టాలనుకుంటే.. గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF) లేదా సోవరీన్ గోల్డ్ బాండ్లను కూడా పరిశీలించవచ్చు. అలాగే వెండి కూడా మంచి లాభాలను ఇచ్చే పెట్టుబడి సాధనంగా మారింది. కాబట్టి ఆర్థిక సలహాదారుల సలహా మేరకు సరైన నిర్ణయం తీసుకోండి.
Credit: Goodreturns



Click it and Unblock the Notifications











