Latest Updates
-
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం -
అమెరికాలో చీప్,భారత్ లో కాస్ట్లీ : ఇండియాలోనే తయారవుతున్నా..ఐఫోన్ల ధరలు ఎందుకు మండిపోతున్నాయి? -
ఉద్యోగులకు అలర్ట్..మీ గుండెను దెబ్బతీస్తున్న 4 ప్రధాన కారణాలివే! -
స్వీట్ షాప్ స్టైల్ మలై బర్ఫీ..ఈ సింపుల్ రెసిపీ తెలిస్తే ఇకపై బయట కొనరు! -
అంగారకుడి నీచ సంచారం.. ఈ 4 రాశుల వారు కళ్లు తెరిచి ఉండకపోతే పక్కాగా నష్టపోతారు! -
పెళ్లిళ్లలో ఇది లేకుండా భోజనం పూర్తి కాదు.. నోరూరించే ఆంధ్రా స్టైల్ గోంగూర శనగపప్పు పులుసు.! -
షాపులో దొరికే కల్తీ బెల్లం వద్దు.. ఇంట్లోనే స్వచ్ఛమైన బెల్లం చేసుకోండిలా! -
దానిమ్మ గింజలు ఏ రంగులో ఉంటే ఎక్కువ పోషకాలు లభిస్తాయో తెలుసా.. USDA డేటా ఇదే.! -
చిట్టి గణేశుడిని ఇంట్లోకి తెస్తున్నారా.. సంప్రదాయం ప్రకారం ఎన్ని రోజులు పూజించాలో తెలుసా.?
కుప్పకూలుతున్న బంగారం ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అయిదో రోజుల పాటు చుక్కలు చూపిన పసిడి రేట్లు నేడు పడిపోయాయి. బుధవారం నాటితో పోల్చుకుంటే మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో తక్కువకు ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయంగా ధరల తగ్గుదల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్ పడింది. అయిదారు రోజుల సుదీర్ఘ ర్యాలీ తర్వాత పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించడం ఇందుకు ప్రధాన కారణం.
దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,60,516 వద్ద ట్రేడ్ అయింది. ఇది మునుపటి ముగింపు ధరతో పోలిస్తే 0.40 శాతం తగ్గుదల కనిపించింది. వెండి రేట్లు కూడా నేడు తగ్గాయి. కిలో వెండి 1.19 శాతం తగ్గి రూ.2,65,121కి చేరుకుంది. కిందటి నెలలో బంగారం 10 గ్రాములకు రూ. 1,80,000 ఆల్‌టైమ్ హై, వెండి కిలోకు రూ. 4,20,000తో రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అదే బాట పట్టాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,277, 22 క్యారెట్లు - రూ. 14,920, 18 క్యారెట్లు - రూ. 12,765
ముంబై..
24 క్యారెట్లు - రూ. 16,168, 22 క్యారెట్లు- రూ. 14,820, 18 క్యారెట్లు - రూ. 12,126
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 16,168, 22 క్యారెట్లు- రూ. 14,820, 18 క్యారెట్లు - రూ. 12,126
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 16,168, 22 క్యారెట్లు- రూ. 14,820, 18 క్యారెట్లు - రూ. 12,126
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 16,168, 22 క్యారెట్లు- రూ. 14,820, 18 క్యారెట్లు - రూ. 12,126
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 16,168, 22 క్యారెట్లు- రూ. 14,820, 18 క్యారెట్లు - రూ. 12,126
Credit: Oneindia



Click it and Unblock the Notifications
