వెండి ధరలపై రాబర్ట్ కియోసాకి షాకింగ్ వ్యాఖ్యలు.. కొనుగోలుదారుల గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు..

By Borra Hazarathaiah

అంతర్జాతీయంగా, దేశీయంగా వెండి ధరలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నడూ లేని గరిష్ట స్థాయిలను తాకుతూ పెట్టుబడుదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బంగారం తర్వాత అత్యంత కీలక విలువైన లోహంగా భావించే వెండి ఇప్పుడు పెట్టుబడుల మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే బంగారం, వెండి వంటి హార్డ్ అసెట్లపై పెట్టుబడులను బలంగా ప్రోత్సహించే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి చేసిన తాజా వ్యాఖ్యలు సామాన్యులకు ఆందోళన కలిగిస్తున్నాయి.

రాబర్ట్ కియోసాకి గత కొన్నేళ్లుగా ప్రభుత్వాల అధిక రుణాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఫియాట్ కరెన్సీల విలువ క్షీణతపై తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా silver ధర రేపు ఔన్స్‌కు 100 డాలర్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమై, ఆ తర్వాత ఆల్‌టైమ్ హైలను నమోదు చేస్తుంది అంటూ తన 'ఎక్స్' (మునుపటి ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో పాటుగా దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అంటూ యూజర్లను చర్చకు ఆహ్వానించారు.


Robert Kiyosaki silver prediction silver price forecast silver to hit 100 silver all-time highs silver investment news precious metals outlook silver market rally silver vs gold investment Rich Dad Poor Dad silver silver price surge silver demand 2026 silver bullion investment global silver market silver price today silver future prediction safe haven assets inflation hedge silver commodities market news 100

ఈ ట్వీట్ వెలువడిన వెంటనే పెట్టుబడిదారులు, ట్రేడర్లు, మార్కెట్ నిపుణుల మధ్య విస్తృత చర్చ మొదలైంది. కొందరు కియోసాకి మాటలను భవిష్యత్ ఆర్థిక సంక్షోభాలపై హెచ్చరికగా చూస్తుండగా, మరికొందరు దీన్ని అతిశయోక్తిగా అభివర్ణిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వెండి వంటి ప్రపంచవ్యాప్తంగా లిక్విడ్‌గా ట్రేడయ్యే కమోడిటీ ధర ఒక్కరోజులో 100 డాలర్లకు చేరుకోవాలంటే సాధారణ మార్కెట్ పరిస్థితులు సరిపోవు. భారీ ఆర్థిక మాంద్యం, గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థలో పెద్ద కుదుపు లేదా వెండి సరఫరాలో తీవ్రమైన అంతరాయం వంటి అసాధారణ పరిస్థితులు ఏర్పడితేనే అటువంటి దూకుడు సాధ్యమవుతుందని వారు చెబుతున్నారు.

అయితే, కియోసాకి వ్యాఖ్యలను తక్షణ ధర అంచనాలుగా కాకుండా దీర్ఘకాలిక ఆర్థిక ప్రమాదాలపై హెచ్చరికగా చూడాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు. ఆయన గతంలో కూడా బిట్‌కాయిన్, బంగారం, వెండి ధరలపై పెద్ద అంచనాలు చేశారు. కొన్ని సందర్భాల్లో అవి కొంతవరకు నిజమయ్యాయని అభిమానులు చెబుతుంటే, మరికొన్ని అంచనాలు అమలుకాలేదని విమర్శకులు గుర్తుచేస్తున్నారు.

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. పసిడి ప్రియుల కొంపలు ముంచిన అమెరికా దాడి.. జనవరి 5, సోమవారం ధరలు ఇవే..

కియోసాకి ప్రధానంగా చెప్పేది ఏంటంటే.. ఫియాట్ కరెన్సీలపై పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరం. ప్రభుత్వాలు అధికంగా నోట్లు ముద్రించడం వల్ల కరెన్సీ విలువ తగ్గిపోతుందని, అటువంటి పరిస్థితుల్లో బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి పరిమిత సరఫరా ఉన్న ఆస్తులే నిజమైన రక్షణగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ కోణంలో చూస్తే, వెండి ధర 100 డాలర్లకు చేరుతుందన్న ఆయన వ్యాఖ్య ఒక రోజు,అలాగే ఒక వారం అంచనాగా కాకుండా రాబోయే కాలంలో సంభవించవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.

Credit: Goodreturns

Story first published: Monday, January 5, 2026, 15:10 [IST]
Desktop Bottom Promotion