మారుతి గూబ గుయ్ మనిపించే పంచ్.. జనవరి 13నే రంగ ప్రవేశం.. ఐదు లక్షలకే 5 స్టార్ సేఫ్టీ

By Chinthareddy Rakeshreddy

టాటా మోటార్స్ తన సంచలన మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ (Tata Punch) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లోకి వదలడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే మార్కెట్లో దుమ్మురేపుతున్న పంచ్‌ను ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, అడ్వాన్సుడ్ ఫీచర్లతో జనవరి 13, 2026న అధికారికంగా విడుదల చేయబోతున్నారు. నానో రేంజ్ ధరకే ఒక గట్టి ఎస్‌యూవీని అందించాలనే లక్ష్యంతో టాటా ఈ కొత్త వెర్షన్‌ను సిద్ధం చేసింది.

మొదట టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను జనవరి 15న లాంచ్ చేస్తారని అందరూ భావించారు. ఎందుకంటే అదే రోజున ఐకానిక్ టాటా సియెర్రా(Tata Sierra) డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి. కానీ, టాటా మోటార్స్ అనూహ్యంగా రెండు రోజుల ముందే, అంటే జనవరి 13నే ఈ కొత్త పంచ్‌ను లాంచ్ చేస్తున్నట్లు తన మొదటి టీజర్ వీడియో ద్వారా స్పష్టం చేసింది. సంక్రాంతి పండగ వేళ కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది ఒక తిరుగులేని ఆప్షన్ కానుంది.

Tata Punch Facelift Incoming Early EV-Inspired Design ADAS Buzz Price Starts Around Rs 5 75 Lakh

కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్ చూడ్డానికి పంచ్ ఈవీని పోలి ఉంటుంది. దీని ఫ్రంట్ గ్రిల్ పూర్తిగా మారిపోయింది. కొత్త LED హెడ్ ల్యాంప్స్, షార్ప్ లుకింగ్ DRLs, రీ-డిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్ దీనికి మరింత రగ్గడ్ లుక్‌ను ఇస్తున్నాయి. వెనుక వైపు కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, కొత్త అలాయ్ వీల్స్ ఈ మైక్రో ఎస్‌యూవీ రేంజ్‌ను పెంచేశాయి. ఇంటీరియర్‌లో కూడా 10.25-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ రాబోతున్నాయి.

టాటా పంచ్ అంటేనే భద్రతకు మారుపేరు. ఇప్పటికే గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ రేటింగ్ సాధించిన ఈ కారులో, ఇప్పుడు భద్రతను మరింత పెంచేందుకు ADAS (Advanced Driver Assistance Systems) ఫీచర్లను కూడా చేర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది నిజమైతే, తక్కువ బడ్జెట్ కార్లలో ADAS ఇచ్చే మొదటి కంపెనీగా టాటా రికార్డు సృష్టిస్తుంది. ఇది కాకుండా 6 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్‌గా వచ్చే అవకాశం ఉంది.

Tata Punch Facelift Incoming Early EV-Inspired Design ADAS Buzz Price Starts Around Rs 5 75 Lakh

మెకానికల్‌గా మాత్రం ఈ కారులో పెద్దగా మార్పులు ఉండవు. ఇప్పటికే ఉన్న 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ నే కొనసాగించనున్నారు. ఇది 88 bhp పవర్, 115 Nm టార్క్‌ను ఇస్తుంది. అలాగే ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో కూడిన CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే, ఈసారి సిఎన్‌జీలో కూడా ఆటోమేటిక్ (AMT) గేర్‌బాక్స్ ఇచ్చే ప్లాన్‌లో టాటా ఉంది. దీనివల్ల సిటీలో డ్రైవ్ చేయడం మరింత సులభమవుతుంది.

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర దాదాపు రూ.5.75 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ఉండవచ్చని అంచనా. ఈ ప్రైస్ పాయింట్ వద్ద ఇది మారుతి స్విఫ్ట్, హుందాయ్ ఎక్స్టర్ వంటి కార్లకు వెన్నులో వణుకు పుట్టించడం ఖాయం. ఒక సామాన్యుడు కూడా తక్కువ ధరలో గట్టి ఎస్‌యూవీని సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది టాటా. ఇది మార్కెట్లో తప్పకుండా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Credit: Drivespark

Desktop Bottom Promotion