Latest Updates
-
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది? -
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.!
ఆ కోరికలు తీర్చుకోవడానికే సహజీవనం.. అందుకే పెళ్లికి దూరం..
Actress Srivani: తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సీరియల్ నటి శ్రీవాణి. ఇటీవల జబర్దస్త్ వర్ష హోస్ట్ చేస్తున్న కిస్సిక్ టాక్ షోలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం, పెళ్లి, లివింగ్ రిలేషన్ వంటి అంశాలపై బహిరంగంగా స్పందించారు. రియల్ లైఫ్‌లో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్న శ్రీవాణి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే..?
హైదరాబాద్‌కు చెందిన శ్రీవాణి, తొలుత దర్శకుడు కోదండరామిరెడ్డి రూపొందించిన గొడవ చిత్రంలో చిన్న పాత్ర పోషించి సినీరంగంలో అడుగుపెట్టింది. అనంతరం సినీరంజనీ అనే కార్యక్రమంలో యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో టెలివిజన్ అవకాశాలు రావడంతో సంఘర్షణ, కాంచన గంగ, చంద్రముఖి వంటి పాప్యులర్ సీరియల్స్‌లో నటించింది. అలాగే మావిచిగురు, కలవారి కోడళ్లు, రాములమ్మ, తిరుమాంగల్యం వంటి పలు సీరియల్స్‌లో నటించి బుల్లితెర కుటుంబ ప్రేక్షకుల అభిమానిని అయింది.

ఇటీవల జబర్దస్త్ వర్ష హోస్ట్ చేస్తున్న కిస్సిక్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం,వివాహం, లివింగ్ రిలేషన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టాక్ షోలో పెళ్లిపై ప్రశ్నించగా, శ్రీవాణి సమాధామిస్తూ.. 'ఈ రోజుల్లో చాలామంది పెళ్లిని తేలికగా తీసుకుంటున్నారని, పెళ్లి ఇప్పుడు అవసరం లేదని భావించే వారు పెళ్లి తర్వాత, ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత తాము పడే కష్టాలు అర్థం చేసుకుంటారని చెప్పారు. "పెళ్లి లైఫ్‌లో తప్పనిసరి. మనకు ఒక తోడు ఉండాలి. వాళ్లు ఎవరో బాగా చూసి, టైం తీసుకుని పెళ్లి చేసుకోవాలి. వెంటనే పిల్లల్ని కనకుండా, రెండు సంవత్సరాల తర్వాత ప్లాన్ చేయాలి. లేదంటే పిల్లలు మధ్య ఉండే గొడవలు వారి భవిష్యత్తుపైనా ప్రభావం చూపుతాయి'' అని తెలిపారు.
లివింగ్ రిలేషన్‌షిప్‌పై మీ అభిప్రాయం ఏమిటన్న ప్రశ్నకు శ్రీవాణి కాస్త సీరియస్ గానే స్పందించారు. "ఇద్దరూ ఒక ఇంట్లో ఉండి కోరికలు తీర్చుకుంటారు. తర్వాత బోర్ వచ్చి విడిపోతారు. అప్పుడు బాధ్యత ఎవరిదీ? ఒకసారి అలవాటు అయితే పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే ఉండదు'' అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే, "లివింగ్ రిలేషన్‌షిప్ అనేది కేవలం ఫిజికల్ అవసరాల కోసమే కొనసాగుతుందని చాలా మందిలో ఓ అభిప్రాయం ఉంది. భవిష్యత్‌లో పెళ్లి చేసుకోవాలనుకునే వారు ఇప్పుడే పెళ్లి చేసుకుని బాధ్యతలు పంచుకోవచ్చు' అంటూ చెప్పారు.
లివింగ్ రిలేషన్‌షిప్‌ను ప్రోత్సహించే వారిపై కూడా ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సహజీవనాన్ని సపోర్ట్ చేసే వాళ్లకి బుద్ధి లేదు అంటానని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పటి జెనరేషన్‌లో ఎక్కువ మంది లైఫ్‌లో సెట్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారని, ఈ ఆలోచన ఎప్పుడూ సరైన ఫలితాన్ని ఇవ్వదని అన్నారు. "లైఫ్‌లో ఏం జరగాలో అదే టైంలో జరగాలి. నేను లైఫ్‌లో సెట్ కాకపోయినా పెళ్లి చేసుకున్నా ఇప్పుడీ హాయిగా ఉన్నాను. అసలు సెట్ అయిన తర్వాతనే బాగుంటుందనేది ఎక్కడ రాసి ఉంది?'' అంటూ ప్రశ్నించారు.
Credit: Filmibeat



Click it and Unblock the Notifications
