బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్..నిపుణులు చేస్తున్న హెచ్చరిక ఇదే..

By Borra Hazarathaiah

ఈ వారం బంగారం, వెండి ధరలు తీవ్రమైన హెచ్చుతగ్గులతో పెట్టుబడిదారులను అయోమయంలోకి నెట్టాయి. ఒక రోజు ఉదయం ధరలు ఒక్కసారిగా పెరగడం, సాయంత్రానికి మళ్లీ తగ్గిపోవడం, మరుసటి రోజు తిరిగి బలంగా ఎగబాకడం వంటి పరిణామాలు మెటల్ మార్కెట్లో స్పష్టమైన దిశలేమిని చూపించాయి. అయితే ఈ గందరగోళానికి ముగింపు పలికే సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. Gold, వెండి ధరలు ఇకపై కొత్త అప్‌ట్రెండ్‌లోకి ప్రవేశించే అవకాశాలు బలంగా ఉన్నాయి.

ఈరోజు హైదరాబాద్ రిటైల్ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఒక్కరోజులోనే రూ.1,000 పెరిగి రూ.1,29,000కు చేరింది. అదే సమయంలో పౌన్ (8 గ్రాములు) బంగారు ఆభరణాల ధర రూ.800 పెరిగి రూ.1,03,200కు చేరింది. వెండి ధర మరింత దూకుడుగా కిలోకు రూ.7,000 పెరిగి రూ.2,75,000 స్థాయిని తాకింది. ప్లాటినం ధర కూడా 10 గ్రాములకు రూ.1,020 పెరిగి రూ.65,580గా నమోదైంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఇదే ధోరణి కనిపించింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి స్పాట్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ఔన్స్ ధర 4,460 డాలర్ల నుంచి 4,509 డాలర్ల వరకు ఎగబాకింది. ఈ పెరుగుదల యాదృచ్ఛికం కాదు. అమెరికా నుంచి వచ్చిన కీలక ఆర్థిక గణాంకాలే బంగారం ధరలకు బలమైన మద్దతు ఇచ్చాయి.


gold price today gold rockets above 4500 gold weekly gain 4 percent gold price surge US NFP impact on gold non farm payrolls gold gold rally explained gold hits record high gold price after NFP safe haven gold dollar weakness gold gold market news gold price outlook precious metals rally inflation hedge gold 4500 4 US NFP

దేశీయంగా MCX మార్కెట్లో కూడా శుక్రవారం చివరికి బంగారం, వెండి ధరలు ఉదయం నమోదైన నష్టాలను పూర్తిగా తుడిచిపెట్టేశాయి. MCXలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా 0.04 శాతం పెరిగి రూ.1,38,875 వద్ద ముగిసింది. వెండి ధర మాత్రం కేవలం 0.29 శాతం తగ్గి రూ.2,52,002 వద్ద స్థిరపడింది. మొత్తంగా చూస్తే, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఈ వారం పెట్టుబడిదారులకు దాదాపు 4 శాతం లాభాన్ని అందించింది.

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. వామ్మో ఇదేమి పెరుగుదల బాబోయ్.. జనవరి 10, శనివారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఎందుకు మళ్లీ బలంగా మారాయనేది ఇప్పుడు అసలు ప్రశ్న.. దీనికి ప్రధాన కారణం అమెరికాలో విడుదలైన ఉద్యోగ గణాంకాలు. డిసెంబర్ నెలకు సంబంధించిన US ఉద్యోగ నివేదిక అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడం మార్కెట్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా సెలవుల కాలంలో ఉద్యోగ సృష్టి ఎక్కువగా ఉండాలి కానీ ఈసారి ఉద్యోగాల సంఖ్య నవంబర్‌తో పోలిస్తే గణనీయంగా తగ్గింది. నిరుద్యోగిత రేటు తక్కువగా ఉన్నప్పటికీ, ఆర్థిక మందగమన సంకేతాలు స్పష్టంగా కనిపించాయి.

ఈ పరిణామాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానంపై అంచనాలను మార్చాయి. మార్కెట్ వర్గాలు ఈ ఏడాది ఫెడ్ కనీసం 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించవచ్చని భావిస్తున్నాయి. వడ్డీ రేట్లు తగ్గితే, బంగారం వంటి వడ్డీ లేని ఆస్తులపై డిమాండ్ పెరుగుతుంది. దీనికితోడు, ట్రంప్ గ్రీన్‌ల్యాండ్ వ్యాఖ్యలు, యూరోప్-నాటో మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లిస్తున్నాయి.

ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే.. సమీప కాలంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుదల దిశగా సాగనున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్టుబడిదారులు ఇకపై ఈ విలువైన లోహాలను సేఫ్-హెవెన్ ఆస్తులుగా మరింతగా పరిగణించే అవకాశాలు ఉన్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి

Credit: Goodreturns

Story first published: Saturday, January 10, 2026, 13:38 [IST]
Desktop Bottom Promotion