బర్త్ డే బహుమతులు ఇవ్వండిలా....

By B N Sharma

Classic Baby Girl Birthday Gift Ideas
ఇంటిలో ఒక బేబీ పుట్టిందంటే....ఎంతో సందడి. ఎన్నో బహుమతులు. అయితే కొత్తగా పుట్టిన బేబీ గరల్ కు ఇచ్చే పుట్టిన రోజు బహుమతి అందరూ ఇష్టపడేలా ఎలా వుండాలో చూద్దాం. ప్రతి బిడ్డకు చాక్ లెట్లంటే ఇష్టమే. లాలీపప్ లంటే మరింత ఇష్టం. బోల్డన్ని చాక్ లెట్లు లేదా పిల్లలు ఆడుతూ కూడా తినదగిన లాలీపప్ లు ఆకర్షణీయమైన కవర్ లో పెట్టి లేదా టిన్నులో వుంచి బహుమతి ఇవ్వండి. దీనికి మరింత ఆకర్షణ జోడించాలంటే బేబీ సాక్స్ కొని వాటిలో ఈ చాక్ లెట్లు పోసి ఇవ్వండి. సాక్స్ ను మీరు స్వయంగా మంచి రంగులతో తయారు చేయండి. లేదా కొనండి.

బేబీ బాస్కెట్ లు కూడా బహుమతిగా బాగానే వుంటాయి. వీటిలో బేబీకి పనికి వచ్చే బొమ్మలు, చాక్ లేట్లు, ఇతర ఆట వస్తువులు వేసి ఇవ్వండి. లేదా బేబీకి మొదటి పుట్టిన రోజు అయితే ఒక ఊయల బహుమానం ఇవ్వండి. ఆడపిల్లలు అలంకరణ ఇష్టపడతారు. గోల్డ్ ఛైన్ లేదా చిన్న చెవి రింగులు ఇవ్వండి. ఇది ఎప్పటికి గుర్తుంటుంది.

బేబీ లు పింక్ కలర్ దుస్తులలో బాగుంటారు. కనుక పింక్ రంగు దుస్తులు, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్ బహుమతిగా ఇవ్వండి. బేబీలకు సాఫ్ట్ టాయ్స్ చాలా ఇష్టం. మెత్తటి బొమ్మను లేదా కార్టూన్ బొమ్మను బహుమానం ఇవ్వండి.

Story first published: Wednesday, September 14, 2011, 10:52 [IST]
Desktop Bottom Promotion