Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బిడ్డ తినే ఆహారం రుచికరం చేయటమెలా?

సాధారణంగా, పిల్లల టేస్ట్ బడ్స్ కూడా మన టేస్ట్ బడ్స్ వలెనే ఎంతో చురుకుగా వుంటాయి. అయితే వారి సున్నితమైన జీర్ణవ్యవస్ధను దృష్టిలో వుంచుకొని వారికి రుచి లేని చప్పటి ఆహారాన్నిస్తాము. బిడ్డకు ఇచ్చే ఆహారంలో మసాలాలు, నూనెలు వాడలేము కాని బేబీ ఆహారాన్ని తగినంత రుచిగా తప్పక తయారు చేయగలం అనేది గుర్తుంచుకోవాలి.
క్రింది విధానాలు ఆచరించి మీ బిడ్డ ఆహారం రుచికరంగా వుండేట్లు తయారు చేసేందుకు ప్రయత్నించండి.
1. గుడ్లు లాంటివి ప్రయత్నించండి. మీ బిడ్డకు చక్కటి ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు అందించగల గుడ్డుతో బంగాళ దుంప సలాడ్ చేసి తినిపించండి. దీనికి కావలసింది రెండు గుడ్లు, కొన్ని బంగాళదుంపలు మాత్రమే. ఈ మిశ్రమానికి కొద్దిపాటి మిరియాల పొడి తాజా వెన్న కలపండి. ఈ మిశ్రమం బిడ్డకే కాదు మీకు కూడా ఆరోగ్యాన్నిచ్చేదే. మంచి రుచి వుండటం చేత బేబీ వెంటనే తినేస్తుంది. అవసరం అనుకుంటే మీరు కూడా దానిని తినవచ్చు.
2. పప్పు దినుసులు. పప్పులు సాధారణంగా మనం పెద్ద వాళ్ళ మైన తర్వాత కూడా తింటాము.కందిపప్పు లేదా పెసరపప్పులను వేయించి, చక్కగా ఉడికించి దానిని బిడ్డ తినే అన్నంతో కలిపి పెట్టండి. పప్పులలో అనేక పోషకాలు, ప్రొటీన్లు వుండి బిడ్డకు మంచి ఆరోగ్యాన్నిస్తాయి.
3. కూరల పోషకాలు: పప్పు కలగలుపులనే మాట మీరు వినే వుంటారు. ఇందులో నూనెలు, మసాలాలు ఏమీ వుండవు. వుడికించిన అన్నం, పప్పు, కూరలు మూడూ ఇందులో వుంటాయి. అన్నాన్ని పప్పుతో కలిపి అందులో టొమాటోలు,బీన్స్, కేరట్స్, బీట్ రూట్ ఇంకా ఏమైనా ఆ కాలంలో పండే కూరలు వేసి మెత్తగా ఉడికించండి. అందులో కొద్దిపాటి వెన్న లేదా నేయి వేసి బాగా కలిపి బేబీకి తినిపించండి.
సంవత్సరమన్నా గడవక ముందే మీ బేబీ తినటానికి తిరస్కారం చూపుతూ వుంటుంది. కనుక ఈ రకంగా హాని లేని వివిధ మిశ్రమ ఆహారాలను రుచికరంగా అందించి తినడంలో ఆసక్తి కలిగించవచ్చు.



Click it and Unblock the Notifications