Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పాకే పాపకు జాగ్రత్తలు తీసుకోండి!

1. ఇంటి శుభ్రత: బేబీ ఎదుగుదల దిశగా అడుగులు వస్తోంది. కనుక మీరు ఇంటిని మరింత పరిశుభ్రంగా ఉంచాలి. ఇప్పటి వరకు మీ బేబీ నిలకడగా ఒక చోటే కూర్చునేది. కాని ఇపుడు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడకు పాకేస్తోంది. పిల్లలు తమ చేతులు, కాళ్ళతో నేలపైనా, సోఫాలపైనా, టేబుల్స్, వంటగది ప్లాట్ ఫారం, ఈ రకంగా ఎక్కడ వారికి అనువుగా వుంటే అక్కడల్లా పాకేస్తారు. ఏది దొరికితే దాన్ని నోటిలో పెట్టుకొని జబ్బులు కూడా పడతారు. రోజుకు మీరు కనీసం రెండు సార్లయినా ఫినాయిలు వేసి నేల తుడవాలి. నేలపై కార్పెట్ వేశారా? అయితే దానిని తీసేయండి. కార్పెట్లను నేల చేసినంత శుభ్రం చేయలేము. మీ ఇంటిలోకి ఎవరూ కూడా మురికిపట్టిన బూట్లు లేదా సాక్స్ తో నడవకుండా చూడండి.
2. గాయాలు : పాకే పిల్లలకు దెబ్బలు తగులుతూండటం కూడా జరుగుతుంది. పాకటంలో గల ఆనందంతో జరగబోయే యాక్సిడెంట్లను వారు లెక్కపెట్టరు.
3. పదునైన వస్తువులను వారికందకుండా ఉంచండి. పిల్లలు నోటిలో పెట్టుకుంటారనుకునే చిన్న గోలీల వంటి వాటిని కూడా అందకుండా చూడండి. బేబీ పాకుతోందంటే, నించోటానికి కూడా ప్రయత్నిస్తుంది. కనుక పదునుగా వున్న అంచులుకల ఫర్నిచర్ కు ప్లాస్టర్ వేసి వుంచండి.
4. మీ ఇంటిలో మెట్లు వుంటే మరింత జాగ్రత్త అవసరం. ఇరవై నాల్గు గంటలు బేబీని గమనించటం కుదరదు. కనుక మెట్ల గదికి తాళం వేయండి. లేదా మెట్ల భాగంలో బేబీ బయటకు పోకుండా ఒక చిన్న తలుపు ఏర్పాటు చేయండి. పిల్లలకు మెట్లు ఆసక్తికరం. అవి చూసిన వెంటనే వారు వాటి వద్దకు పాకేస్తారు. మెట్ల కారణంగా ఎన్నో మరణాలు సంభవించిన కేసులు కూడా వున్నాయి.
5. బేబీ బెడ్ మీద నిద్రిస్తున్నపుడు కనీసం 4 దిండ్లను పక్కన వుంచండి. నిద్రలో పక్కకు దొర్లకుండా తగిన జాగ్రత్త తీసుకోండి.
6. పిల్లల పరిశుభ్రత: మీ ఇంటి పరిశుభ్రతే కాదు బేబీ పరిశుభ్రత కూడా మీరు జాగ్రత్తపడాలి.
7. పిల్లల మోకాళ్ళు, చేతులు దుమ్ములో తిరుగుతూంటాయి. వీటికి కనీసం రోజుకు రెండు సార్లు యాంటీ సెప్టిక్ లోషన్ తో కడగాలి. బేబీ పాకేటపుడు మోకాళ్ళు జాయింట్ల వద్ద నల్లగా అవుతుంది. దాని గురించి ఆందోళన చెందకండి. వారు నడవటం మొదలుపెడితే అది పోతుంది.
బేబీ పాకేటపుడు ఈ మాత్రం జాగ్రత్తలు పాటిస్తే బేబీ పాకే దశ చాలా వరకు సురక్షితంగా గడచిపోగలదు.



Click it and Unblock the Notifications