Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
కొత్తగా పుట్టిన పిల్లల సాధారణ ప్రవర్తనలు!

1. ఏడ్వటం - ఏడవటం పిల్లలకు సాధారణమే. ఆకలి, అలసట, అసౌకర్యం, చికాకు వంటి వాటికి ఏడుస్తారు. కొంతమంది పగలు ఏడుస్తే, మరి కొంతమంది పిల్లలు రాత్రులందు ఏడుస్తూ వుంటారు.
2. నిద్ర - సాధారణంగా పిల్లలు రోజుకు 20 గంటలపాటు నిద్రిస్తారు. ఈ సమయం బిడ్డలకు వేరు వేరుగా కూడా వుంటుంది. ఏకబిగువున 3 లేదా 4 గంటలు పడుకుంటారు. కొన్ని సమయాలలో అరగంటలో లేచి కూర్చుంటారు. కొంతమంది రాత్రులలో చాలా ఆలస్యంగాను మరి కొంతమంది చాలా త్వరగాను కూడా నిద్రిస్తారు.
3. ఆహారం - కొత్తగా పుట్టిన బిడ్డల ఆహారపుటలవాట్లు రోజు రోజుకు మారుతూంటాయి. పుట్టిన రోజు, పాలు బలవంతంగా తాగించాలి. నిద్రపోతున్నా లేపి మరి తాగించాలి. అలవాటయిందంటో, తరచుగా కోరతారు. వారి పొట్ట చిన్నది కనుక, తరచుగా పాలు పట్టాలి.
4. చూపు - బిడ్డ పుట్టిన కొత్తల్లో చూపు నిలపలేదు. మెల్లగా తన చూపు నిలపటం చేర్చుకుంటుంది. ఒక నెలరోజులు అయిన తర్వాత వారికి నలుపు తెలుపు రంగులు తెలుస్తాయి. నెల తర్వాతే చూపుమీద అంటే వారి కంటి కండరాలపై వారికి నియంత్రణ వచ్చి గుర్తించటం మొదలుపెడతారు.
5. విషయాలు గ్రహించటం, వేళ్ళు, కాలి బొటన వేలు వంటివి చీకటం, చేతులూ ఊపటం, కాళ్ళు తన్నటం వంటివి కూడా కొత్తగా పుట్టిన పిల్లలలో నిదానంగా ఏర్పడటం గమనించవచ్చు. ఈ రకంగా పిల్లలు తమ కండరాలను స్వాధీనంలోకి తెచ్చుకోవడం గమనించవచ్చు.
సాధారణంగా బేబీలు అందరూ పైన చెప్పిన చర్యలు చేస్తూ వుంటారు. వీటికి వ్యతిరేకంగా ఏదైనా ప్రత్యేకతలు కనపడితే నిరంతరం ఏడుస్తున్నా, పాలు చాలటం లేదని ఏడుస్తున్నా అటువంటివి గ్రహించి అందుకవసరమైన పరిష్కారాలు కనుగొనాలి.



Click it and Unblock the Notifications
