Latest Updates
-
ఒత్తయిన జుట్టుకి దివ్య ఔషధం కరివేపాకు నిల్వ పచ్చడి.. ఈ ఒక్కటి కలిపారంటే పది రెట్లు రుచి.! -
భార్యాభర్తలు కలయిక తర్వాత తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లేదంటే.! -
మళ్లీ మళ్లీ ప్రేమలో ఎలా పడాలి.. ప్రతిరోజూ రొమాంటిక్గా సాగేందుకు టిప్స్.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ప్రొటీన్ రిచ్ ఇడ్లీలు.. మినప్పప్పు, రవ్వతో పనిలేదు.! -
మీ ఇంట్లో రోజూ చేసే ఈ 5 పొరపాట్లే షుగర్ వ్యాధికి అసలు కారణం! -
తులసి మొక్క ఇలా మారితే అశుభానికి సంకేతమా.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే.! -
ఈ క్యారెట్ పాయసం చేస్తే.. గిన్నెలో ఒక్క చుక్క కూడా వదలకుండా లాగించేస్తారు! -
కారు ఎక్కగానే వాంతులు అవుతున్నాయా.. ఈ రెండూ వెంట ఉంటే చాలు.. వెంటనే రిలీఫ్.! -
ఈ బఠానీ గుడ్డు మసాలా రుచి చూడండి..ఏమి టేస్ట్ రా నాయనా అదిరిపోతుందంతే..ఎలా చేసుకోవాలంటే.. -
పిల్లల్లో బలాన్ని పెంచే ’రైస్ కేక్’.. గుడ్డు, చక్కెర లేకుండా ఎంతో టేస్టీగా.!
పిల్లల దైనందిన చర్యలు ఎలా వుండాలి?

నిద్ర లేవడం - పిల్లలు త్వరగా నిద్ర లేవాలి. ఉదయం వేళే తాజాగా దిన చర్య మొదలు పెట్టడం పిల్లాడికి మంచి అలవాటు. ఉదయం 6.00 గం. నుండి 7.00గం.లోపు నిద్ర లేవాలి. అందుకుగాను వారికి అలారం పెట్టుకునే అలవాటు కూడా చేయండి. కొద్ది రోజులు శ్రమ పడితే, తర్వాత వారంతట వారే ఈ క్రమ శిక్షణకు అలవాటు పడిపోతారు.
బ్రేక్ ఫాస్ట్ - నిద్ర లేచిన వెంటనే బ్రేక్ ఫాస్ట్ ఇవ్వకండి. ఉదయం 8 గం. నుండి 9 గం.మధ్య వారు కాసేపు ఆడిన తర్వాత బాగా ఆకలి భావిస్తున్నపుడే ఆరోగ్యకరమైన వేడి బ్రెడ్, గుడ్డు, లేదా పండ్లు వంటివి ఇవ్వండి. తిన్న ఆహారం బాగా వంటపడుతుంది. పిల్లలకు ఆకలి అనేది కూడా తెలియాలి.
స్నానం - ఉదయం వేళ 9.30 గం. నుండి 10 గం. మధ్య ప్రతిరోజూ స్నానం చేయించండి. రోజంతా తాజాగా వుంటుంది. స్కూలు వున్న పిల్లలైతే, ఇంకా ముందుగానే స్నానం చేయించాలి. ఎందుకంటే, స్నానం తర్వాత వారు కొన్ని ఉదయం వేళ పనులు అంటే, ప్రేయర్ వంటివి చేసుకోవాల్సి వుంటుంది.
ఇంటిలో ఆటలు - ఉదయం 10.30 గం. నుండి 12 గం. మధ్య పిల్లల మనోవికాసానికి అవసరమయ్యే పజిల్స్, బ్లాక్ బిల్డింగ్ వంటివి నేర్పించండి. ఉదయం వేళ ఎంత నేర్చుకోగలిగితే పిల్లలకు అంత మంచిది.
లంచ్ - మధ్యాహ్నం లంచ్ పిల్లాడికి అధికంగానే ఇవ్వండి. మధ్యాహ్నమయ్యే సరికి అతను మత్తుగా నిద్రించాలి. కనుక 12.30 గం. నుండి 1 గం. మద్య భోజనం పూర్తి చేయండి.
మధ్యాహ్న నిద్ర - రోజులో మధ్యాహ్నం 1.30 గం. నుండి 3.30 గం. మధ్య మీ పిల్లాడు నిద్ర పోవాలి. మధురమైన మ్యూజిక్ పెట్టి నిద్రించేలా చేయండి.
సాయంత్రం చిరుతిండి - సాయంత్రం చిరుతిండి పిల్లాడికి చాలా తేలికగా వుండాలి. త్వరగా జీర్ణమై రాత్రతి భోజనం ఆటంకం లేకుండా వుండాలి.
ఎనర్జీ డ్రింక్ - 4.30 గం.నుండి 6 గం. మధ్య బలమైన ఎనర్జీ డ్రింక్ ఏదైనా ఇవ్వండి.
ప్లేటైమ్ - రాత్రి 7 గం. నుండి 8.30 గం.ల వరకు పిల్లాడిని ఆటలకు ప్రోత్సహించండి.
డిన్నర్ - డిన్నర్ రాత్రి 7 గం. లోపుగా ఇచ్చేయండి. నిద్రించే సమయానికి అది జీర్ణమై గాఢ నిద్ర పడుతుంది.
నిద్ర - రాత్రి 8 గం. నుండి 9 గం. మధ్య తప్పక నిద్రించేలా చేయండి. ఉదయమే త్వరగా నిద్ర లేవటానికి ప్రోత్సహించండి.



Click it and Unblock the Notifications