Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
వయసు ఏదైనా...పుస్తక విలువలు ఒకటే!
అపుడపుడే ఊహ తెలుస్తున్న పిల్లలకు ఒక బొమ్మల పుస్తకం చూస్తే అదేమిటో తెలియదు. కాని బిడ్డ దానిని చూస్తాడు. ప్రత్యేకించి, బొమ్మల ముఖాలు, వాటి రంగులు, డిజైన్లు వంటివి అతడిని ఆకర్షిస్తాయి. అటువంటపుడు ఆ పుస్తకాలను చూపుతూ అతనికి జోలపాటలు, చిన్న పద్యాలు వంటివి ఆసక్తికరంగాను, హాయిగాను వుండేలా చేయండి.

ఈ వయసు పిల్లలకు పుస్తకాలపై ఎలా ఆసక్తి కలిగించాలి? వాటిని పెద్దగా చదవండి. దానికి ఎంతో నైపుణ్యం లేదా వస్తువులు అవసరం లేదు. మీరు మీ బేబీ, కొన్ని పుస్తకాలు వుంటే చాలు. రోజూ కొద్ది నిమిషాలు మీ బిడ్డకు సమయం కేటాయించి వాటిని అతనికి చదవండి. అయితే, తరచుగా ఈ పని చేయండి. అన్ని పుస్తకాలు పూర్తిచేయాలనే నియమం పెట్టుకోకండి. మీరు మీ బేబీ బాగా ఇష్టపడే పేజీలనే చదవి ఆనందించండి.
అతను పగటిపూట మరియు రాత్రివేళ నిద్రించే సమయానికి ముందు ఈ అలవాటు చేయాలి. బేబీని హత్తుకొని పడుకోవటమే కాదు. ఈ పుస్తకాల ఆనందం కూడా అధికంగా వుంటుంది. ఒక రొటీన్ పెట్టుకోవటంతో మీకు కూడా తేలికగా వుంటుంది. ఈ చర్య మీ బేబీని ప్రశాంతంగా వుంచటమే కాక, నిద్రించేందుకు ఒక సమయం కూడా ఏర్పరుస్తుంది. బేబీ ఏడుస్తున్నా లేక, తింటున్నా, ఉత్సాహంగా వున్నా కూడా ఈ బొమ్మల పుస్తకాలను చదువవచ్చు. డాక్టర్ వద్దకు వెళ్ళి వేచివున్న సమయంలో లేదా కిరాణా షాపుకి వెళ్ళి లైనులో వున్నపుడు కూడా మీరు మీ బిడ్డకు ఇటువంటివి చేయవచ్చు.
చదివేటపుడు బేబీని హత్తుకుంటూ హావభావాలు వ్యక్తీకరించండి. మీ స్వర ధ్వని పెంచండి లేదా తగ్గించండి. బేబీ, ఎంతో భధ్రత, ఆనందం భావిస్తుంది. పుస్తకంలో వున్నవి అలానే ఖచ్చితంగా చదవాలని లేదు. బొమ్మలు బిడ్డకు చూపుతూ ప్రశ్నలు వేయండి. పిల్లి అంటే ఏమిటి....ఇది. కుక్క అంటే ఏమిటి....ఇది అంటూ చూపాలి. ఈ చర్యలన్నీ తర్వాతి రోజులలో బిడ్డకు చదువుకు చాలా తేలికవుతాయి. ఒక పునాదిగా వుంటాయి. నర్సరీ పాటలు, జంతువుల అరుపులు, మీ మోకాళ్ళపై బిడ్డను ఆడిస్తూ చదువనేది ఒక ఆటగా చదవాలి.
బేబీలు మనం తరచుగా చేసేదాన్ని బట్టే నేర్చుకుంటారు. మిమ్మల్ని ప్రేమిస్తారు. కనుక, ఒకే పుస్తకం ఎన్ని సార్లు అయినా చదివేయవచ్చు. బేబీ పెద్దది అయ్యే కొద్ది, పుస్తకాలు పట్టుకోవడం నేర్పించండి. వాటిని నోటిలో పెట్టుకోవద్దని తెలుపండి. అవి తినేవి కాదని తెలుపండి. బేబీ పుస్తకాలలో బొమ్మలుండాలి. మొదటి కొద్ది నెలలు బేబీ మీ స్వరధ్వని ఇష్టపడుతుంది. కనుక పెద్దగా చదవండి.
బేబీకిగల స్నానపు సమయం, బెడ్ సమయం, ఆహార సమయంలలో ఈ పుస్తకాలను చూపుతూ ఆనందింపచేయండి. చిన్న చిన్న మాటలతో, వాక్యాలతో వివరించండి. వారికి అర్ధం కాకపోయినప్పటికి ఆసక్తి కలుగుతుంది. మీ బిడ్డ మంచి రీడర్ కావాలనుకుంటే, మీ ఇంటిలో అనేక పుస్తాకాలను ఉంచండి. బేబీ పెరిగి పెద్దదవుతూంటే, అతని ఆటబొమ్మలతో పాటు పుస్తకాలను కూడా కలిపి ఉంచండి. కొన్ని పుస్తకాలను మీరు కూడా చదువుకోండి. బేబీకి మీరు ఒక రోల్ మాడల్ గా చిన్నప్పటినుండే కనపడతారు.



Click it and Unblock the Notifications