Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లలలో వినికిడి.... చెవుల శుభ్రత ఎలా?

1. పిల్లలు స్నానం చేసినపుడు చెవి బయటి భాగాన్ని టవల్ తో శుభ్రంగా తుడవండి. చెవిలో కొద్ది చుక్కలు బేబీ ఆయిల్ వేసి లోపల వున్న మురికి గుబిలి మెత్తబడేలా చేయండి.
2. ఒక కాటన్ గుడ్డ ముక్క తీసుకుని వేడినీటిలో ముంచండి. దానిని సన్నగా చుట్టి మరోమారు చెవి అంతా శుభ్రంగా బయటివైపు తుడవండి.
3. చెవి వెనుక భాగాలు ప్రధానంగా శుభ్రం చేయాలి. సాధారణంగా ఈ భాగాలను స్నానం తర్వాత తుడవటానికి అశ్రద్ధ చేస్తూ ఉంటాము. ఇక చెవి లోపలి భాగం శుబ్రం చేయటానికి గాను మరో పలుచటి గుడ్డ ముక్కను సన్నగా చుట్టి చెవిలో ఇప్పటికే మెత్తబడ్డ గుబిలిని బయటకు తీయండి.
4. చెవి పైభాగాలను కూడా ఇదే రకంగా శుభ్రం చేయవచ్చు.
5. చెవిలోపలి శుభ్రతకు గాను పెట్టే గుడ్డను సవ్యంగా తిప్పుతూ బయటకు లాగుతూంటే, లోపలి గుబిలి బయటకు వచ్చేస్తుంది.
6. రెండవసారి చెవిలోపల శుభ్రం చేయాలంటే అదే గుడ్డను కాకుండా మరొక తాజా గుడ్డ ముక్కను ఉపయోగించండి.
7. చెవిలోపల భాగంలోకి గుడ్డను అధికంగా ఒత్తిడి చేయకండి. లోపలి చెవి భాగాలు చాలా సున్నితంగా వుంటాయి. పిల్లల వినికిడిలో ఏ మాత్రం తేడా గమనించినా, వెంటనే చెవి వైద్య నిపుణులవద్దకు తీసుకు వెళ్ళండి. వారు చెవిని తగిన లోషన్లతో తేలికగా శుభ్రం చేస్తారు.
8. పిల్లలు స్కూలులో టీచర్లు చెప్పే అంశాలు సరిగా వినగలుగుతున్నారా లేదా అనేది కూడా టీచర్లను అడిగి తెలుసుకోండి.
ఈ రకమైన శుభ్రతతో అధికంగా వుండే గుబిలి తీసేయవచ్చు. లోపల ఇంకా కొంత వున్నప్పటికి అది హాని కలిగించదు. అధికంగా వుండే గుబిలిని మాత్రమే ఎప్పటికపుడు తీసేయాలి. చెవులు శుభ్రం చేసేటపుడు పిల్లలనుండి వ్యతిరేకత లేకుండా వారితో మాటలు చెపుతూ లేదా బొమ్మలతో ఆడిస్తూ మెల్లగా శుభ్రం చేయాలి.



Click it and Unblock the Notifications