Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
బేబీ పుట్టగానే మీ భావనలు ఎలా వుంటాయి?

ఈ సమయంలో ప్రతి తల్లితండ్రి ఎంతో విభిన్నంగా స్పందిస్తారు. కొంతమంది తల్లులు, తమ శిశువును చూడగానే తాను పడ్డ కాన్పు నొప్పులన్నీ మరచిపోతారు. బిడ్డను చూసి కొంతమందికి ఎంతో శక్తి వస్తుంది. మరికొంతమంది విచారం పొందుతారు. కొంతమందికి ప్రసవానంతర మనోవేదన వస్తుంది. బేబీ భూమి మీద పడగానే తల్లితండ్రులలో ఏర్పడే భావావేశాలకు ఒకవైద్యుడు, నర్సు లేదా కౌన్సెలర్ వంటి వారు చక్కని అవగాహన నీయగలరు.
స్నేహితులతో, ఇతర కుటుంబ సభ్యులతో తల్లితండ్రులు తమ భావాలను ఎలా పంచుకోవాలి? మీకు బిడ్డ పుట్టాడన్న వార్త ప్రపంచానికంతకూ తెలియపరచవలసిందే. అయితే, బిడ్డ పుట్టిన మొదటి రోజు ఎవరైనా సరే పెద్ద ప్రచారం ఇవ్వకుండా సింపుల్ గా వుండాలి. సన్నిహిత స్నేహితులకు కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియపరచి ఆ సమాచారం ఇతర స్నేహితులకు, బంధువులకు తెలియపరచమనాలి. దీనితో మీరు మీ శిశువుకు అధిక సమయం కేటాయించగలరు.
మీకు ప్రియులైన వారు మీ బేబీని మొదటి రోజే చూడవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ లేదా సోదరుల వంటివారు శిశువును చూడవచ్చు. అపుడే బంధం పెనవేయటం మొదలుపెట్టవచ్చు. కాని అధికమైన సందర్శకులకు అవకాశమివ్వకండి. బేబీ మొదటి రోజు ప్రశాంతంగా, హడావుడిలేకుండా వుండాలి. ఈ సమయంలో తల్లితండ్రులు, బేబీ అధిక సమయం కలిసి వుండి బంధం ఏర్పరచుకోవాలి.
మొదటి కొద్ది వారాలు సందర్శకులను కనీస స్ధాయిలో వుంచి బేబీకి ఇన్ఫెక్షన్లు రాకుండా చూడండి. వచ్చి చూసే వారు జబ్బు పడనివారుగా వుండాలి. బేబీని దూరం నుండి చూడాలి లేదా స్పర్శించాలంటే, చేతులు శుభ్రంగా కడుగుకొనాలి. బేబీ ముందస్తుగా పుట్టిన సమస్య వుంటే, ఈసమయం మరింత జటిలంగా వుంటుంది. హాస్పిటల్ సిబ్బంది చెప్పిన విధంగా జాగ్రత్తలు పాటించాలి. వైద్య సిబ్బంది మీ అవసరాలకు వెంటనే స్పందిస్తారు. తరచుగా వైద్యులతో సంభాషించండి. ఈ సమయంలో మీకు ఏ సహాయం కావలసి వచ్చినా తగిన వారిని సంప్రదించండి.
బేబీ పుట్టిందంటే మీరు కొత్త జీవిత దశలోకి అడుగుపెట్టినట్లే. ఈ కొత్త ఆరంభానికిగాను బేబీ మొదటి రోజునుండే మీరు కృషి చేయండి.



Click it and Unblock the Notifications