Latest Updates
-
మగాళ్లను చంపి ఎలా తప్పించుకోవాలి..? మెట్రోలో మహిళ చేసిన షాకింగ్ పని.. వైరల్ వీడియో.! -
బ్లాక్ క్యాట్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి?..మీ పార్టనర్ కు ఈ లక్షణాలు ఉన్నాయా? -
బాత్రూమ్లో దుర్వాసన.. సువాసన వెదజల్లే ఫ్రెషనర్స్ ఇంట్లోనే 5 నిమిషాల్లో రెడీ.! -
వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి.! -
కండరాల బలానికి, రోజంతా ఎనర్జీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..10 నిమిషాల్లో ఎగ్ అవకాడో ఖాఖ్రా చాట్ చేయండిలా.. -
మీ స్నేహితుల్లో ఈ 4 లక్షణాలు ఉంటే వెంటనే దూరం పెట్టండి! -
ఆకలి తీరాలి, బరువు పెరగకూడదు..అయితే డిన్నర్ కి ఇది బెస్ట్ చాయిస్..10 నిమిషాల్లోనే చేసేయండిలా! -
బానిసత్వం పోయింది బాస్: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగి..మేనేజర్ ప్రశ్నకు జెన్ జీ ఉద్యోగి దిమ్మతిరిగే కౌంటర్ -
పప్పులు నానబెట్టే పనే లేదు.. అప్పటికప్పుడు అచ్చం పునుగుల్లా ఉండే మినీ రైస్ బోండా చేసుకోండిలా.. -
ఆ కంపెనీలో హస్తప్రయోగం చేసుకోడానికి అరగంట బ్రేక్!
అప్పుడే పుట్టిన బిడ్డకు ఎటువంటి ఆహారం ఇవ్వాలి...?
పుట్టే పసిపిల్లలు చాలా సున్నిత స్వభావం కలిగి సుత్తిమెత్తగా ఉంటారు. అప్పుడే పుట్టే పిల్లలకు జీర్ణశక్తి ఉండదు. కాబట్టి అప్పుడే పుట్టిన పిల్లలకు ఏది ఎంత అవసరమో వారికి అంతే అందించాలి. ఏది ఎక్కువతక్కువలైనా సమస్యే. కాబట్టి పసిపిల్లలకు ఎటువంటి ఆహారం అందించాలో చూద్దాం...

పసిపిల్లలకు పెట్టాల్సిన భోజనం ఏమిటి? పుట్టిన పిల్లలకు సాధారణ ప్రసవంలోనైతే అర గంట నుంచి గంటలోపు పాలు ఇవ్వడం ప్రారంభించాలి. అదే సిజేరియన్ అయినట్టయితే 1-2 గంటల లోపు పాలు ఇవ్వాలి. ప్రసవానంతరం మొదటిసారిగా వచ్చే పచ్చని పాలు తప్పనిసరిగా పిల్లలకు పట్టించాలి. ఈ పాలలో ప్రొటీన్ శాతం, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఈ పాలు పట్టడం వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
మొదటిసారి తల్లులైన వారిలో పాలు పట్టడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొంత మందిలో ప్రసవం తర్వాత వెంటనే పాలు రాకపోవచ్చు, అయినప్పటికీ పాలు ఇచ్చేందుకు తప్పనిసరిగా ప్రయత్నించాలి. క్షీరగ్రంథులు ప్రేరేపితమై పాలు పడతాయి. పిల్లలకు పాలిచ్చే తల్లులు ఆహారం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. గర్భం సమయంలో ఏవిధంగానైతే ఇద్దరి పోషణకు సరిపడ ఆహారం తీసుకోవడం అవసరమో పిల్లలకు పాలిస్తున్నపుడు కూడా అలాగే ఇద్దరికి సరిపోను ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.
ఎక్కువగా పండ్లు, పాలు, పండ్లరసాలు వంటి వాటివల్ల పాల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. తల్లిపాలు తాగుతున్న పిల్లల్లో కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని కోలిక్ పెయిన్ అంటారు. ఇలాంటి నొప్పి పిల్లల్లో గమనించినపుడు తల్లులు ఆహారపానీయాల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇటువంటి పిల్లల తల్లులు ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి, కాఫీ, టీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, సిట్రస్ పండ్లు తీసుకోకూడదు. పుట్టినప్పటి నుంచి ఆరునెలలు తప్పకుండా తల్లిపాలు ఇవ్వాలి.
ఇంకేం పెట్టవచ్చు? ఆరునెలల వరకు తల్లి పాలు మినహా మంచినీటితో సహా ఇటువంటి ఆహారం పిల్లలకు అవసరముండదు. ఆరు నెలల నుంచి ఇతర ఆహారాన్ని ఇవ్వవచ్చు. అయితే తల్లి పాలు మాత్రం మానవద్దు. తల్లి పాలతో పాటుగా ఈ పై ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా పైన ఇచ్చే ఆహారాన్ని కాంప్లిమెంటరీ ఫుడ్ అంటారు. ఇలా రెండు సంవత్సరాల వరకు పైన ఇచ్చే ఆహారంతో పాటు తల్లిపాలు కూడా ఇవ్వాలి.
అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో త్వరగా పై ఆహారం ప్రారంభించాల్సి రావచ్చు. బిడ్డ పెరుగుదల సరిగా లేనపుడు, తల్లి పాలు చాలినంత లేనపుడు, తల్లి ఉద్యోగస్తురాలైనపుడు నాలుగో నెల నుంచి కొంత పై ఆహారాన్ని ఇవ్వాల్సి రావచ్చు. తల్లి దగ్గర బొత్తిగా పాలు లేవనుకున్నపుడు మార్కెట్‌లో లభించే ఫార్ములా ఫీడింగ్‌ను ఉపయోగించవచ్చు. దీనికి కూడా తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.



Click it and Unblock the Notifications