Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వర్షాకాలంలో బేబీల ఆరోగ్య జాగ్రత్తలు!

బేబీల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు -
పరిశుభ్రత - అన్నిటికంటే ముందుగా బేబీ పట్ల మీరు పరిశుభ్రత పాటించాలి. వర్షాకాలం అయినప్పటికి మీ బేబీకి చెమట అధికంగా పడుతుంది. కనుక బేబీకి యాంటీ సెప్టిక్ సబ్బుతో ప్రతిరోజూ కనీసం ఒక సారి అయినా స్నానం చేయించండి. బేబీ చర్మంపై చెమట అధికంగా ఏర్పడకుండా చూడండి. అది బేబీకి దురద, దద్దుర్లు, అలర్జీలు కలిగిస్తుంది.
ఆహారం - వర్షాకాలంలో వచ్చే చాలా వ్యాధులు, నీటి సంబంధితమై వుంటాయి. కనుక మీ బేబీ గురించి జాగ్రత్త పడాలి. ఆహారం లేదా నీటి కాలుష్యం కారణంగా డయోరియా వంటి వ్యాధులు రాకుండా చూడండి. బేబీ పాల సీసా బాగా స్టెరిలైజ్ చేయించండి. లేదా వేడినీటితో శుభ్రం చేయండి. బిడ్డ ఆహారం తినే ప్లేట్లు, గిన్నెలు శుభ్రం చేయండి. ప్రధానంగా, బేబీని సంరక్షించే సమయంలో లేదా ఆహారం ఇచ్చేటపుడు మీరు చేతులు శుభ్రంగా ఉంచుకోండి.
సరైన దుస్తులు - ఈ కాలంలో బేబీకి సరైన దుస్తులు వేయాలి. సాధ్యమైనంత మేరకు కాటన్ దుస్తులు ధరింపజేయండి. వాతావరణం బాగా చల్లగా వుంటే, బేబీకి వేడి కలిగించే ఉన్ని దుస్తులు వాడండి. జలుబు వంటివి చేయకుండా వుంటాయి.బేబీ ఆరోగ్యం బాగా ఉండాలంటే, సరైన దుస్తులు వేయటం ప్రధానమని గ్రహించండి.
దోమలనుండి రక్షణ - వర్షాకాలంలో దోమలు అధికంగా వస్తాయి. దోమలవలన కూడా అనేక వ్యాధులు ప్రబలుతూంటాయి. కనుక బేబీకి చేతులకు, కాళ్ళకు దోమలు కుట్టకుండా దుస్తులు వేయండి. నిద్రించే సమయంలో దోమతెర పెట్టండి. రసాయనాలు కల దోమ మందులు బేబీ చర్మానికి రాయకండి. అవి మీ బేబీ ఆరోగ్యానికి హానికరం.అదే విధంగా రసాయనాలు కల ఆల్ అవుట్ వంటి దోమ మందులు, లేదా రసాయనాలు కల కాయిల్స్ వంటివి కూడా బేబీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. బేబీ శరీరం ఎంతో సున్నితమైనదని గ్రహించండి. ఈ రకమైన దోమ మందులు పెద్దలకు సరిపడినప్పటికి సున్నితమైన బేబీ ల శరీరాలకు సరిపడవు.
సాధారణ జాగ్రత్తలు - చివరి అంశంగా మీ బేబీ ఈ కాలంలో తడి నేపీలు కలిగి వుండకుండా వాటిని ఎప్పటికపుడు మార్చండి. శరీరంపై తడి అధికంగా వుంటే బిడ్డకు దద్దుర్లు ఏర్పడతాయి. బేబీ గోళ్ళను వారానికొకసారి కత్తిరించండి. మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచండి. ఇంటిపరిసరాలలో నీరు నిలవకుండా, దోమలు చేరకుండా చూడండి. ఈజాగ్రత్తలు వర్షా కాలంలో పాటిస్తే మీ బేబీ ఆరోగ్యమే కాదు, ఇంటిలోని ఇతర సభ్యుల ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది.



Click it and Unblock the Notifications