Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
పిల్లలు ముద్దుగా బొద్దుగా వుంటే.... !

పరిశోధనలో బ్రిస్టల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డేబీ లాలర్, ఆయన సహచరులు షుమారు 5,000 మందికి పైగా పిల్లలను అధ్యయనం చేశారు. పిల్లలను సుమారుగా వారు పుట్టినప్పటినుండి స్టడీ చేశారట. 9 నుండి 12 సంవత్సరాల వయసు కల ఈ పిల్లలకు నడుము కొలత, కొవ్వు వంటి బాడీ మాస్ ఇండెక్స్ పరిశీలించారు. బాడీ మాస్ ఇండెక్స్ ఒక వ్యక్తి ఎత్తు, బరువులను బట్టి పొందుతారు. సాధారణంగా పిల్లలకు వారి జండర్ అంటే లింగం మరియు వయసులను పరిగణలోనికి తీసుకుంటారు. ఈ పరిశోధనలో బాలుర కంటే కూడా బాలికలకు అధిక బాడీ మాస్ ఇండెక్స్ వున్నట్లు తేలింది.
ఈ పిల్లలు యుక్తవయసు అంటే 15 నుండి 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి వీరికి పరిగణించదగిన స్ధాయిలో రక్తపోటు వచ్చేసింది. ఇన్సులిన్ స్ధాయి, కొల్లెస్టరాల్ గ్లూకోజ్ వంటివి కూడా పెరిగి వీరు గుండె జబ్బులకు దగ్గరలో వున్నారని రీసెర్చి తెలిపింది. అధిక బరువు పొందిన ఈ పిల్లలలో రక్తనాళాలు గట్టిపడటం కూడా రీసెర్చర్లు గమనించారు. భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యం సరిగా వుండాలంటే వారికి గుండె సంబంధిత రోగాలవంటివి రాకుండా వుండాలంటే చిన్న వయసులనుండి వారి జీవన విధానాలను సరిదిద్దాలని రీసెర్చర్లు సూచించారు.



Click it and Unblock the Notifications
