Latest Updates
-
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.!
మహిళకు గర్భం ఏ వయసులో? ఎలా రావాలి?

మహిళ ఏ వయసులో గర్భం ధరించాలి? మహిళ 30 లేదా 32 సంవత్సరాల వయసు వచ్చే సరిగి ధరించటం శ్రేష్టం. 35 సంవత్సరాల వయసు పైబడితే గర్భం ధరించే అవకాశాలు సన్నగిల్లుతాయి. గర్భం ధరించినా, కొన్ని సమస్యలు పుట్టే బిడ్డకు రావచ్చు. 35 సంవత్సరాల వయసు పైన గర్భం ధరించాలనుకునేవారు వైద్యుల సలహాపై పొందటం మంచిది. మహిళలు ప్రెగ్నెన్సీ అంటే చాలా భయపడతారు. దీనికిగాను భాగస్వామి సహకారం అవసరం. నేటి యువతులు ఉద్యోగాలు, వ్యాపారాలవంటి ఇతర పనులలో కూడా వున్నారు కనుక వీరికి 30 ఏళ్ళవయసుకి పిల్లలుపుడితే సరైనదనే చెప్పాలి. 35 సంవత్సరాల వయసు పైబడితే రక్తపోటు, షుగర్ వ్యాధి సమస్యలు వచ్చి బేబీకి హాని కలిగించే అవకాశం వుంది.
గర్భం వచ్చిన మొదటి నెలలో మహిళ గర్భంలో రిలీజ్ అయిన అండం ఫేలోపియన్ ట్యూబులలోకి వస్తుంది. అక్కడే వీర్యకణాలు కూడా దానికి చేరి ఒక అద్భుతమైన మానవ సృష్టికి కారణమవుతుంది. 46 క్రోమోజోములు ఒక వ్యక్తికిగల లక్షణాలను సృష్టిస్తాయి. మానవ పిండ నిర్మాణానికి పునాదులు వేస్తాయి. ఫెలోపియన్ ట్యూబు నుండి పిండం గర్భంలోకి చేరి అక్కడ దాని సురక్షితమైన ప్రదేశానికి అన్వేషిస్తుంది. ఆ దశలో పిండం అంగుళంలో ఆరోవంతు సైజులో వుంటుంది. అయితే వేగంగా పెరిగిపోతూ వుంటుంది.
ఆ పిండంలోని గుండె సుమారుగా ఒక విత్తనమంత సైజుగా వుండేది 18 వ రోజునుండే కొట్టుకుంటూ వుంటుంది. ఒక్క నాలుగు రోజులు వేచి వుంటే చాలు 21 వ రోజునుండి తన రక్తాన్ని పిండంలోని అన్ని భాగాలకు పంప్ చేయటం కూడా మొదలుపెడుతుంది. బహుశ ఈ రక్తం మీ రక్తం కంటే కూడా విభిన్నంగా వుండవచ్చు. ఫలదీకరణ జరిగిన నాలుగు వారాలకు కళ్ళు, చెవులు, శ్వాస అవయవాలు ఏర్పడటం మొదలుపెడతాయి. 9 నుండి 12 వారాల సమయంలోనే పిండం లో బొటనవేలు చీకడం సైంటిస్టులు ఫొటోల ద్వారా కనుగొన్నారు.
చిన్న పిండంగా వున్న బేబీ తన తల్లి తినే ఆహారాన్ని తాను పంచుకుంటుంది. తల్లి గర్భంలో వుండి మొదటగా ఆహార రుచులు చూడటం మొదలుపెడుతుంది. ఈ కారణంగానే గర్భవతికి రుచులు కోరే అవకాశం వస్తుంది. పుల్లగా వుండేవి తినాలని, లేదా మసాలాలు గుప్పించిన ఆహారాలు తినాలని ఆమెకు కోరికలు కలుగుతాయి.



Click it and Unblock the Notifications
