Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
తరిగే వయసు - పెరిగే భాధ్యతలు!

ఆరోగ్య పరిరక్షణ - అసలు అన్నిటికంటే ముందు, బిడ్డకు జన్మనిచ్చేటందుకు మీ ఆరోగ్యాలు ఎలా వున్నాయనేది చెక్ చేసుకోవాలి. ప్రత్యేకించి తల్లిగా సమర్ధవంతంగా తన పాత్రను పోషించే అవకాశం ఆమెకు వుండాలి. అందుకుగాను అవసరమైన వైద్యపరీక్షలు వంటివి చేయించుకోవాలి. అదే విధంగా బిడ్డకు జన్మనివ్వటంలో సమయం, సందర్భం మొదలగు విషయాలలో జంటలు ఒకే అవగాహనకు రావాలి.
కుటుంబ సహకారం - నేటి రోజుల్లో, జంటలు ఏ బాదరబందీ లేకుండా తామిద్దరూ మాత్రమే వేరుగా వుండాలని కోరుతున్నారు. ఈ పరిస్ధితిలో ఆమె గర్భవతి అయితే, తనంతతాను ఆరోగ్య పరిరక్షణ చేసుకోగలదా? బిడ్డ పుడితే ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచగలదా వంటి అంశాలను పరిశీలించాలి. తల్లి తండ్రులవ్వాలనుకునే జంటలకు తమ కుటుంబ సహకారం ఎంతో ప్రధానం. గర్భవతి అయ్యే మహిళ ఎన్నో రకాల మనో భావనలకు గురవుతూంటుంది. అటువంటపుడు ఆమె తల్లి లేక అత్తల సహకారం అత్యవసరమవుతుంది.
ఆర్ధిక పరిస్ధితి - కుటుంబంలోకి బేబీ రాకతో ఆర్ధిక పరిస్ధితి మారుతుంది. మీ ఆర్ధిక పరిస్ధితి ఒక్కసారి సమీక్షించండి. మీ మధ్య ఆర్ధికపర అభిప్రాయ బేధాలు లేకుండా కొనసాగండి. ఈ అంశం నిర్లక్ష్యం చేస్తే అది మీ మధ్య విభేధాలు పెంచే అవకాశం వుంది.



Click it and Unblock the Notifications
