Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కుంకుమ పువ్వు తింటే పిల్లలు తెల్లగా పుడతారా.....!?
కుంకుమ పువ్వును ఇంగ్లీష్ లో సాప్రాప్ అంటారు. కుంకుమ పువ్వు ఒకరకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఖరీదైనదే కాదు అద్భుతమైన ఔషధ గుణాలు కలిగినది. కుంకుమ పువ్వు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా వుంటుంది. గర్భవతులు అయిన స్త్రీలు కుంకుమపువ్వు పాల్లో వేసుకుని తాగితే పుట్టబోయే పిల్లలు మంచి రంగుతో పుడతారని అంటారు. అది వాస్తవమే అయినప్పటికీ కేవలం గర్భవతులే కాదు కుంకుమ పువ్వును ఎవ్వరైనా తీసుకోవచ్చు. కుంకుమ పువ్వు తీసుకోవడం వలన ఆరోగ్యం మరింత మెరుగువుతుందని ఆరోగ్యనిపునులు చూచిస్తున్నారు.
కుంకుమ పువ్వు మధ్య ఉండే రేణువులను తీసి కుంకుమ పువ్వు తయారు చేస్తారు. ఒక కిలో కుంకుమ పువ్వును తయారు చేయాలంటే కనీసం రెండు లక్షల పువ్వులు అవసరమవుతాయట. అందుకే పువ్వు ధర చాలా అధికంగా ఉంటుంది. గర్భవతులు అయిన స్త్రీలు కుంకుమపువ్వు పాలల్లో వేసుకుని తాగితే పుట్టబోయే పిల్లలు మంచి రంగుతో పుడతారని అంటారు. అది వాస్తవమే అయినప్పటికీ కేవలం గర్భవతులే కాదు. కుంకుమ పువ్వును ఎవ్వరైనా తీసుకోవచ్చు. కుంకుమ పువ్వు తీసుకోవడం వలన ఆరోగ్యం మరింత మెరుగవుతుంది . గర్భిణులు మొదటి నెలనుండీ కుంకుమపువ్వు వాడవచ్చును... కానీ మొదటి మూడు నెలలు వేవుళ్ళు (వాంతులు) ఉంటాయి కాబట్టి ... అనుకూలత బట్టి వాడాలి . తేనె , పాలు , పటికి పంచదారలతో కుంకుమ పువ్వు కలిపి తినవచ్చును.
ఉపయోగాలు: కుంకుమ పువ్వు జీర్ణశక్తిని పెంచుతుంది. రక్తప్రసరణను మెరుగుపరిచి రక్త పోటును తగ్గిస్తుంది. కుంకుమ పువ్వును పూర్వం చైనీయుల వైద్యంలో విరివిగా వాడేవారు. వారు ఎక్కువగా లివర్(కాలేయ)సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగించేవారు. ఆయుర్వేదంలో ఉదరం పని తీరును మెరుగుపరిచేందుకు జీర్ణక్రియ సంబంధింత సమస్యలను నివారణకు ఉపయోగిస్తారు. ఆకలిని క్రమబద్దీకరించేందుకు, జీర్ణరసాలా ప్రసరణకు, మోనోపాజ్ సమస్యల చికిత్సకు కూడా కుంకుమ పువ్వును వినియోగిస్తారు. దగ్గు, కడుపు ఉబ్బరం చికిత్సకూ వాడుతారు. శారీరక రుగ్మతలతో పాటు డిప్రెషన్‌ను కూడా కుంకుమ పువ్వు తొలగిస్తుంది.

కుంకుమ పువ్వు తో గాఢనిద్ర : రాత్రివేళ ఆహారములోనో , ఏదో ఒక పానీయములోనో కొద్దిపాటి రేకులు వేసుకుంటే గాఢమైన నిద్ర పడుతుంది. నిజానికి కుంకుమ పువ్వులో ఈ గుణాలు రోమన్ల కాలంలోనే గుర్తించారు. ధనవంతులైన రోమన్లు గాఢంగా నిద్రించేందుకు తమ దిండ్లు పై కుంకుమ పువ్వు ఫిలమెంట్లను కుట్టించుకునేవారట. కుంకుమ పువ్వులో ఉండే క్రోసిన్, సాఫరాల్, కెరెటనాయిడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్య విషయంలో కాకుండా సౌందర్య సాధనంగా, వంటలకు ఘుమఘుమలు అందించే పదార్థంగా కుంకుమపువ్వుకు మరేదీ సాటి రాదనేది వాస్తవం. అందుకే కుంకుమ పువ్వుకు నానాటికి క్రేజ్ పెరుగుతున్నది. దీన్ని గాలి, తేమ, తగులకుండా జాగ్రత్తగా భద్రపరిస్తే ఎక్కువకాలం నిలువ ఉంటుంది. ఎంతో ఖరీదుతో కొన్ని కుంకుమపువ్వు పాడవకుండా, రుచి, వాసన తగ్గకుండా ఉండాలంటే భద్రరపర్చడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.



Click it and Unblock the Notifications