Latest Updates
-
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది!
అనుబంధం ఆనందించాలంటే?

పుట్టబోయే బిడ్డతో బంధం ఎలా వుంటుంది? ఎంత గాఢంగా వుంటుందనేది చూడండి.
1. బిడ్డ ఆడ అయినా, మగ అయినా, ఒక పేరు పెట్టేందుకు అప్పటినుండే పేర్లు ఎంపిక చేసుకుంటాం. ఒక గుర్తింపునిచ్చేస్తాం. మార్కెట్లలో దొరుకుతున్న పిల్లల పేర్ల పుస్తకాలను కొనేస్తాం. తమకు పుట్టే బిడ్డ పేరు ఎంతో అరుదైనదిగాను, విలక్షణంగాను వుండాలని భావిస్తాం. పెట్టే పేరుతో బిడ్డ భవిష్యత్తు బంగారుబాట వలే వుండాలని కోరుకుంటాం. కొంతమంది ముందుగా ముద్దు పేరు ఎంపిక చేస్తారు. తర్వాత దానిని వాస్తవ పేరుగా కూడా మారుస్తారు.
2. బిడ్డతో సంభాషణలు - బిడ్డ మహిళ కడుపులో వుండగానే తమ ఆనందాలు పంచుకుంటారు. ఆమె కడుపులో వున్న బిడ్డ, తల్లి మాటలనే కాదు, కుటుంబంలోని ఇతరుల మాటలకను వినేందుకు సైతం అలవాటు పడుతుందనేది పరిశోదనలు రుజువు చేశాయి. కనుక, బిడ్డతో బంధం కడుపులో వుండగానే కుటుంబ సభ్యులకు అనుబంధంగా ఏర్పడుతుంది. ఉత్తుత్తి మాటలు చెపుతూ ఆనందించేస్తారు.
3. తండ్రితో కూడా అనుబంధమే - తల్లి కి కడుపులో వున్న బిడ్డతో అనుబంధం ప్రేమల వంటి వాటి మాదిరిగానే తండ్రికి కూడా అనురాగం ఏర్పడుతుంది. బిడ్డ తండ్రి స్వరధ్వని కూడా ప్రత్యేకంగా ఆలకిస్తుంది. తండ్రి దగ్గరకు వచ్చినపుడు అతనికి కడుపులోని బిడ్డ కదలికలను అవగాహన చేయించండి. మీ పార్టనర్ కూడా మీ వలెనే గర్భవతి దశ అనుభవాలను భావిస్తాడు.
4. బిడ్డకు ఇష్టమైన సంగీతం - గర్భవతి దశలో మ్యూజిక్ వీనుల విందుగా వుంటుందంటారు. చక్కని సంగీతానికి బిడ్డలు స్పందిస్తారు. కనుక బిడ్డతో కడుపులో వున్న దశనుండే బంధం ఏర్పడాలంటే, మంచి మ్యూజిక్ వినండి.
5. అప్పటికే మొదటి బిడ్డ వుంటే - అప్పటికే మీకు ఒక బిడ్డ వుంటే, ఆమె తోకూడా కడుపులో వున్న బిడ్డతో బంధం ఏర్పరచే ప్రక్రియ సాగించాలి. తోబుట్టువు ప్రేమబంధం ఏర్పడాలి.మీ పొట్ట వద్ద బిడ్డతో మాట్లాడిస్తూ, ఆ ధ్వనితో అనుబంధం ఏర్పరచండి. బిడ్డ స్కూలులో ఏం జరిగింది? పుట్టిన తర్వాత తాను ఏం చేస్తుంది? మొదలైన అంశాలు కడుపులో బిడ్డతో మాట్లాడించి అనుబంధం ఏర్పడేలా చేయండి.



Click it and Unblock the Notifications
