Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
గర్భ నిరోధకత తర్వాత గర్భం ధరించటమెలా?

ఇటువంటి వారికి మరల గర్భం ధరించాలంటే కొన్ని మార్గాలు చూడండి.
గర్భ నిరోధక మాత్రలు వాడేటపుడు హార్మోన్లు మీ గర్భాన్ని నిరోధిస్తాయి. హర్మోన్లు స్ధాయి తక్కువైపోవటంతో మీకు పిరీయడ్స్ వస్తూంటాయి. మీరు చివరగా వాడే 3 మాత్రలు ప్రభావం లేనివి కనుక రెండు నుండి 4 రోజులలో మీకు పిరీయడ్ వచ్చేస్తుంది. అండాశయం మరల సాధారణ స్ధితికి చేరాలంటే సమయం తీసుకుంటుంది. శరీర ఆరోగ్యం ప్రతి మహిళకు విభిన్నంగా వుంటుంది. కొంత మందికి మాత్రలు ఆపేసిన కొద్ది రోజులకే గర్భం వస్తే మరి కొందరికి మొదటి ఒకటి లేదా రెండు పిరీయడ్స్ వరకు కూడా రాదు. మాత్రలు ఆపేసినప్పటికి కొంతమందికి పిరీయడ్స్ రాకపోవచ్చు. మీ శరీరంలోని హార్మోన్లు మరో సారి సమతుల్యత సాధించాలి. అందుకుగాను కొంత సమయం పడుతుంది.
మీకు గనుక గర్భ విచ్ఛిన్నం వంటివి జరిగితే గర్భం ధరించటానికి మరో రెండు లేదా మూడు పిరీయడ్స్ సమయం పడుతుంది. దీనితో గర్భధారణలో అసహజమైన రక్తస్రావం వుండదు. కాపర్ టి,లూప్ వంటి సాధనాలు వాడితే శరీర హార్మోన్ల అసమతుల్యత వుండదు. కాపర్ టి, లూప్ వంటివి తీసి వేసిన తర్వాత మహిళ త్వరలోనే గర్భం ధరించవచ్చు. గర్భ నిరోధెక మాత్రలంత ప్రభావం హార్మోన్లపై ఇతర సాధనాలు చూపవు. త్వరగా గర్భం ధరించాలనుకునేవారు కండోమ్ లు, డయాఫ్రంలు వాడి కొంతకాలం గర్భ నిరోధకత ఆచరించి వాటిని వాడకపోవటం ద్వారా అవసరమైనపుడు త్వరగా గర్భం ధరించవచ్చు.



Click it and Unblock the Notifications
