Latest Updates
-
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది!
ఓస్ గర్భం ధరించటం ఇంత తేలికా?

మహిళ బరువు ఏ మాత్రం తగ్గినా సరే అది ఆమెలోని హార్మోన్ల స్ధాయిలను స్ధిర పరుస్తుంది. మరి ఈ బహుళ తిత్తుల వ్యాధిని నివారించాలంటే మీరు ఆరోగ్యకరమైన జీవన విధానాలకు మారాలి. ఇప్పటివరకు మీకుగల సమస్యలకు డాక్టర్లు ఇచ్చిన మందులను నియమానుసారంగా తప్పక వాడండి. మీ ఆహారంలో పీచు అధికంగా ఉండేలా చూడండి. అంటే, తాజా పండ్లు, కూరగాయలు, చేర్చండి. శాట్యురేటెడ్ కొవ్వులు తక్కువగా ఉండాలి. మీ ఆహారం, వ్యాయామాలపై నిపుణుల సలహాలను పాటించండి. ప్రతిరోజూ గుండె సంబంధిత వ్యాయామాలు ఒక గంట చేయాలి. మీ రోజువారీ వ్యాయామంలో, స్విమ్మింగ్, సైకిలింగ్ లేదా ఇతర వ్యాయామాలు గంట సేపు, వామ్ అప్, కూల్ డవున్ లతో సహా చేయాలి.
వారానికి కనీసం ఆరు రోజులు చేయాలి. ఇల్ల్లు, ఆఫీస్ అంటూ శారీరకంగా చురుకుగా తిరగండి. లిఫ్ట్ ఎక్కకుండా మెట్లు వాడటం, డ్రైవింగ్ చేయకుండా తక్కువ దూరాలు నడిచి పనులు చేసుకోవడం, సమీప మార్కెట్లలో కొనుగోలుకు నడిచి వెళ్ళడం వంటివి చేస్తే మీలోని కేలరీలు బాగా ఖర్చు అవుతాయి. బరువు తగ్గుతారు.
మీ కండలు బలపడుతున్న కొద్ది, శరీరానికి అవసరమైన కేలరీలు పెరుగుతాయి. దానితో కేలరీలు బాగా ఖర్చు అవుతాయి. ఎంతసేపూ మీ ఆందోళన శరీర పై భాగం, నడుము భాగం కనుక వాటి కండరాలకు తరచు వ్యాయామం కలిగేలా చూడండి. వారానికి కనీసం రెండు సార్లు ఒక్కొక్కసారి 30 నిమిషాల చొప్పున బరువులు ఎత్తండి. ఈ వ్యాయామాలలో ప్రధాన కండరాలు అన్ని కదలాలి. ధ్యానం, యోగా, ధాయ్ ఛి మరియు పైలేట్స్ ఆచరిస్తే కేలరీలు బాగా కరిగి మీలోని హార్మోన్లు సమతుల్యతను పొందుతాయి.



Click it and Unblock the Notifications
