Latest Updates
-
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు!
పిల్లలు పుట్టిన తర్వాత ఇలా చేయడం కొంచెం కష్టం కదండీ...!
పెళ్ళి అయిన తర్వాత పిల్లలు అనేది ఒక అద్భుతమైన జీవితాన్ని అందిస్తుంది. అదే చాలా మంది చెబుతుంటారు. అది ఎంతవరకూ నిజమో? మీరు వ్యక్తిగతంగా ఒంటిరిగా మరియు పెళ్ళి తర్వాత జంటగా జీవించడానికి, పిల్లలు కలగడానికి ముందు ప్లానింగ్ అవసరం. మీరు పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు, మొదట మీరు మీ జీవితం ఏం చేయాలనుకున్నారో..చిన్న చిన్న ఆశలను ముందే నేరవేర్చుకోవాలి. అవన్నీ కూడాను గర్భం ధరించడానికి ముందే ప్లాన్ చేసుకోవాలి.
చాలా మంది అంటుంటారు పిల్లలు కలగముందుకి, పిల్లలు కలిగి తర్వాత పెద్దగా తేడా ఏంఉండదు. అయితే ఖచ్చితంగా చెప్పాలంటే మాత్రం. ఇది నిజం కాదు. ఎందుకంటే పిల్లలు కలిగిన తర్వాత అక్కడి నుండి మీ జీవితం మారుతుంది. మారుతూనే ఉంటుంది. ఉదాహరణకు: మీరు బాగా ఎంజాయ్ చేయగల బిగ్గార సౌండ్స్ ఉన్న పబ్ కు వెళ్ళాలనుకొంటున్నారా?లేదా లాంగ్ రొమాంటిక్ ప్రదేశానికి వెళ్ళాలనుకొని ప్లాన్ చేసుకొంటారా?అంటే ఖచ్చితంగా సమాదానం లేదు అని వస్తుంది.

మంచి పార్టీకి వెళ్ళండి: బాగా సౌండ్ ఎఫెక్ట్ ఉన్న పార్టీకి, బేబీని భుజాల మీద నిద్రపుచ్చి తీసుకెళ్ళడం కష్టం కనుకు, ఆ పార్టీని ఇప్పుడే ఎంజాయ్ చేసేయండి.

మీకు నచ్చిన డ్రై క్లీన్ మెటిరియల్స్ ధరించండి: కొన్ని పట్టు వస్త్రాలు, కాశ్మిరీ మరియు షిఫాన్ వంటి పొడి వస్త్రాలను ధరించేందకు అనుకూల సమయం. ఇటువంటి దుస్తులను పిల్లలు పుట్టిన తర్వాత రెండేళ్ళవరకూ కుదరదు. కాబట్టి అటువంటి ఆశను ఇప్పడే నిరవేర్చుకోండి.

రోడ్ ట్రిప్స్: రోడ్డు మీద దూర ప్రయాణం చేయడం చాలా కష్టం. కాబట్టి గర్భాధారణ పొందడానికి ముందు మీరు కోరుకున్న ప్రదేశాల చూడటానికి తాత్కాలిక రోడ్ పర్యటనలు పూర్తి చేయండి.

దూర ప్రయాణాలు లేదా టూర్స్ : పిల్లలు కలిగిన తర్వాత టూర్స్ అంటే బ్యాంకాక్ లేదా లాస్ వెగాస్ వంటి ప్రదేశాలకు వెళ్ళడానికి వీలుపడుదు. కాబట్టి పిల్లలు కలగడానికి ముందు ఇటువంటి ప్రదేశాలను చూసేయండి.

అడల్ట్ మూవీస్ చూడటం: పిల్లలు పుట్టిన తర్వాత హింసాత్మకమైన మరియు సున్నితమైన కంటెంట్ బహిర్గతం చేయడానికి ఇష్టం ఉండుదు. కాబట్టి మీరు మీ పాట్నర్ తో కలిసి మీరు చూడాలనుకొన్న అడల్ట్ సినిమాలు చూడవచ్చు.

సాహాస క్రీడలు: మీరు బేబీ కోసం ప్లాన్ చేయడానికి ముందు బంగీ జంపింగ్, పారాసైలింగ్, డైవింగ్, స్కూబా వంటివి చేసి మీ ముచ్చట తీర్చుకోవచ్చు.

నిద్ర: కొత్తగా తల్లి అయిన తర్వాత మీకు నిద్ర అనేది ఉండదు. అందుకు కారణం శరీరంలో కలిగే అనేక హార్మోనుల ఎఫెక్ట్, మరో ప్రక్క బేబీ కేర్ వంటివి మీ నిద్రకు భంగం కలిగించవచ్చు. అందుకనీ మీరు తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.

వైన్ టేస్టింగ్ టూర్స్: మీరు దీర్ఘ కాలంలో మద్యం రుచి చివరిసారి కావచ్చు!

బ్యూటీ కేర్: తల్లి అయిన తర్వాత, జుట్టు సమస్యలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుండి కేశ సంరక్షణ మీద తగినంత శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం.

కెరీర్ రిస్క్: మీరు మీ కెరీర్ పెంచుకోవాలనుకొన్నా లేదా ప్రసవం తర్వాత ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండటానికి అటువంటి సాహసాలను బేబీ ప్లానింగ్ ముందే నెరవేర్చుకోవాలి.
కాబట్టి, గర్భం దాల్చడానికి ముందే మీలో ఉన్నకోర్కెలను తీర్చేసుకోండి. ఎందుకంటే బేబి పుట్టిన తర్వాత కనీసం రెండు సంవత్సరాల పాటు బయట ఎక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండదు. పిల్లలు పుట్టకముందే, కొన్ని కొన్ని వాటిని అవసరం ఉన్నా, లేకున్నా పక్కన పెట్టేసి వీకెండ్ ట్రిప్ సెలబ్రేట్ చేసుకోండి. అయితే, పిల్లలు పుట్టిన తర్వాత ప్లాన్ చేయడానికి కానీ, వెళ్ళడానికి కానీ కుదరు!. అది నిజం.
ఈ ఆర్టికల్ మీకు పిల్లలు వద్దని డిస్కరేజ్ చేయడానికి ఎంత మాత్రం కాదు, వివాహం అయిన తర్వాత వారిలో కొన్ని కోరికలను తీర్చుకోవడానికి అనువైన సమయం అని తెలియజేయడానికి మాత్రమే. మరి గర్భం ధరించడానికి ముందు ఏం చేయాలనుకుంటున్నారో అవి చేసేయండి. ఆలస్యం ఎందుకు?



Click it and Unblock the Notifications