Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
ప్రెగ్నంట్ అవ్వాలనుకునే వాళ్లు ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడని అవాస్తవాలు..!!
తల్లిదండ్రులు అవ్వాలి అనుకోవడం, ఫ్యామిలీని మొదలుపెట్టడం ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకసారి జరుగుతుంది. పేరెంటింగ్ అనేది.. అత్యంత పెద్ద బాధ్యత. జీవితంలో ఇదొక మంచి సమయం. సంతోషం, బాధ్యతలు తీసుకొచ్చేది పేరెంటింగ్.
ఒకసారి బిడ్డకు తల్లి అవాలని నిర్ణయించుకున్న తర్వాత.. వాళ్లు తమ భాగస్వామితో, ఫ్యామితో మాట్లాడుతుంది. వాళ్ల జర్నీ అప్పుడు మొదలవుతుంది. లక్ ఉన్న వాళ్లకు.. అనుకున్న వెంటనే తేలికగా గర్భం పొందుతారు. కానీ.. మరికొందరికి.. కన్సీవ్ అవడం కష్టంగా మారుతుంది. కొన్నిసార్లు ఎక్కువ సమయం పడుతుంది, కొంతమంది హెల్త్ కాంప్లికేషన్స్ ఎదురవుతాయి.
ఒకసారి మహిళలు ఒక ఏజ్ కి వచ్చాక.. కన్సీవ్ అవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు వాళ్లకు వాళ్ల చుట్టూ ఉన్న చాలామంది.. సలహాలు ఇస్తుంటారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, త్వరగా గర్భం పొందాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే సలహాలు ఇస్తుంటారు.
చాలా సందర్భాల్లో తల్లిదండ్రులుగా.. చాలా అయోమయం ఉంటుంది. ఇతరులు చెప్పే విషయాల్లో వాస్తవాలేంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది దానిపై క్లారిటీ ఉండదు. కాబట్టి.. గర్భం పొందే ముందు.. ఎలాంటి విషయాలను పట్టించుకోకూడదో చూద్దాం..

డే టైమ్ సెక్స్ వల్ల త్వరగా కన్సీవ్ అవడం
పగటిపూట ఇంటర్ కోర్స్ లో పాల్గొనడం వల్ల.. త్వరగా కన్సీవ్ అయ్యే అవకాశాలుంటాయని కొంతమంది నమ్ముతారు. కన్సీవ్ అవడం అనేది.. భార్యాభర్తల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని, సమయంతో సంబంధం లేదని.. అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రతిరోజూ సెక్స్
రోజుకి 10 సార్లు సెక్స్ లో పాల్గొన్నా.. కన్సీవ్ అయ్యేది కేవలం అండోత్పత్తి సమయంలో మాత్రమే. అలాగే.. భాగస్వాములు ఇద్దరూ హెల్తీగా కూడా ఉండాలి. ఇలా ప్రతిరోజూ సెక్స్ లో పాల్గొంటే కన్సీవ్ అవుతారు అనేది అపోహ మాత్రమే.

బైక్ నడపడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది
బైక్స్ డ్రైవ్ చేయడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందనేది అపోహ మాత్రమే. ఎందుకంటే.. దీనిపై ఎలాంటి ప్రూఫ్ లేదు. రెగ్యులర్ డ్రైవ్ చేసే అథ్లెట్స్ కూడా తల్లిదండ్రులు అవుతున్నారు.

మగవాళ్ల రీప్రొడక్టివ్ ఆర్గాన్ పై ఐస్ పెట్టడం
మగవాళ్ల రీప్రొడక్టివ్ ఆర్గాన్ పై ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల వాళ్ల భాగంలో చలనం కోల్పోతుంది తప్ప.. స్పెర్మ్ కౌంట్ కి, ఐస్ ప్యాక్ కి ఎలాంటి సంబంధం లేదు.

ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి, కన్సెప్షన్ కి సంబంధం లేదు
చాలామంది మహిళలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది ఇన్ఫెర్టిలిటీకి కారణం అయి ఉండవచ్చు. కాబట్టి.. మీరు ఖచ్చితంగా.. నిపుణుల సలహా తీసుకోవాలి.

ఎస్ టీ డీస్ కి ఇన్ఫెర్టిలిటీకి సంబంధం లేదనడం
మీరు లేదా మీ భాగస్వామి.. ఎవరైనా సెక్యువల్లీ ట్రాన్స్ మిట్ అయ్యే వ్యాధుల బారిన పడి ఉంటే.. కొన్ని ఏళ్ల క్రితం ఈ సమస్య ఎదుర్కొనినా.. ఇన్ఫెర్టిలిటీకి అవకాశం ఉంటుంది.

మహిళలు స్కలనం చెందకపోతే గర్భం పొందలేరు
మహిళల్లో స్కలనం అవసరం లేదు. కేవలం స్పెర్మ్ ఆమె ఎగ్స్ లోకి వెళ్తే చాలు. కాబట్టి.. మహిళల్లో స్కలనం అయితే.. గర్భం పొందుతారు అనేది పూర్తీగా అవాస్తవం.



Click it and Unblock the Notifications
