Latest Updates
-
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.!
పిల్లలకు ఈ ఫుడ్స్ పెడితే వారి ప్రాణాలకే ప్రమాదం.. తల్లులు ఇప్పటికైనా తెలుసుకోండి లేకపోతే!
చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారి ఆరోగ్యంగా ఉండేందుకు, వారు బలంగా పెరిగేందుకు వారి ఆహరం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వారికి తినిపిస్తారు. ఏ చిన్న తప్పు చేసినా అది పిల్లల పాలిట శాపంగా మారుతుంది. అందుకే ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న చిన్న పిల్లలకు కొన్ని అఆహారపదార్థాలు ఇవ్వడం వారి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఆ ఆహారపదార్థాలు తినిపించడం వల్ల వారికి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎలాంటి ఆహారపదార్థాలు తినిపించకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నట్స్ లేదా సీడ్స్
ఐదేళ్లు నిండని పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో నట్స్ లేదా సీడ్స్ తినిపించకూడదు. ఎందుకంటే చిన్న పిల్లలకు గొంతు చాలా చిన్నగా ఉంటుంది. అందుకే వారికి నట్స్ లేదా సీడ్స్ ఇవ్వడం వల్ల అవి వారి గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. అలాగే గింజలను నమలడం వారికి కష్టం అవుతుంది. దీని కారణంగా ఆ గింజలు జీర్ణం అవడానికి కూడా చాలా కాలం పడుతుంది. అందుకే పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నట్స్ లేదా సీడ్స్ ఇవ్వకూడదు. ఇది వారి ప్రాణాలకే ప్రమాదం.

ద్రాక్ష
ద్రాక్ష గుండ్రంగా ఉంటుంది. అది కూడా చిన్న పిల్లల గొంతులోకి వెళ్లేలా అస్సలు ఉండదు. అందుకే పిల్లలకు ద్రాక్ష ఇస్తే కచ్చితంగా వారి గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. దీంతో వారికి ఊపిరి ఆడకుండా ఉంటుంది. అందుకే పిల్లలకు ద్రాక్ష తినిపించాల్సి వస్తే కచ్చితంగా ఆ ద్రాక్ష పండును పావు వంతు తుంచేసి ఇవ్వండి.. ఇలా చేయడం వల్ల ప్రమాదం తగ్గిపోతుంది.
పాప్‌కార్న్
పాప్‌కార్న్ చిన్న పిల్లలకు చాలా ప్రమాదకరం. అయిదేళ్ల లోపు వయసున్న పిల్లల గొంతు పూర్తిగా తయారవదు. అలాగే వారిలో నమిలే సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వారికి పాప్‌కార్న్ తినిపించడం వల్ల అది గొంతులోకి ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. దీని కారణంగా వారి ఊపిరి ఆడకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో మరణించే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే గొంతులో గాయాలు కూడా అవ్వొచ్చు.
యాపిల్, క్యారెట్
క్యారెట్, యాపిల్ వంటి పండ్లను తినాలంటే కచ్చితంగా వాటిని బాగా నమలాలి. కానీ చిన్న పిల్లలు వాటిని బాగా నమలలేరు. అలా నమలకుండా తిండడం వల్ల అవి జీర్ణం కాదు. అలాగే గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే యాపిల్ లేదా క్యారెట్ వంటి పండ్లను మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసే ఇవ్వడం మంచిది. ఇలా చేయడం వల్ల వారికి శక్తితో పాటు జీర్ణం కూడా సులభంగా అవుతుంది.
చూయింగమ్..
అయిదేళ్ల లోపు వయసున్న పిల్లలకు చూయింగమ్ అస్సలు ఇవ్వకూడదు. అవి తింటున్నా వారి నుంచి వాటిని తీసుకోవాలి. చూయింగమ్ శ్వాసమార్గంలో అతుక్కుపోయి వారికి శ్వాస ఆడకుండా చేయగలదు. అందుకే వాటి జోలికి పిల్లలను వెళ్లనివ్వకపోవడమే మంచిది.



Click it and Unblock the Notifications