Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
పిల్లల్లో ఏకాగ్రత కలిగించండి!

1. పిల్లాడు బొమ్మలను ఇల్లంతా విసిరాడు. అవన్నీ సర్దమని మీరు చెప్పండి. ఎంతకీ దానికి రెడీ అవకపోతే, 1, 2, 3 అని మూడు సంఖ్యలు లెక్కపెడతానని, మూడో సంఖ్య లెక్కపెట్టేలోపు అవన్ని సర్దేయాలని చెప్పి వారిలో ఏకాగ్రత తీసుకురండి.
2. పరధ్యానం నివారించండి - పిల్లలు ఏదైనా చెప్పినపుడు టివి లాంటివి చూస్తూ పరధ్యానంలో వుంటారు. లేదా నటిస్తారు. మీరు సీరియస్ గా వుంటే తప్ప వారు మీరు చెప్పేదానిపై శ్రద్ధ పెట్టరు. కనుక తల్లితండ్రులుగా మీరు కొంత త్యాగం చేసి, టి.వి. ఇతర వినోదాలు ఇంటిలో కట్టిపెట్టి. పిల్లాడు తన పనిపై ఏకాగ్రత పెట్టేలా చూడండి. టైమ్ పాస్ టివి లకంటే క్రమశిక్షణతో కూడిన జీవన విధానం చిన్నతనంనుండే అవసరం.
3. శుభ్రత విషయంలో కఠినంగా - రోజుకు రెండుసార్లు బ్రషింగ్, చెప్పులు బయట వదలటం, డైనింగ్ లోనే తినటం వంటి వాటిలో కఠినంగా వుండి ఆరోగ్యకర అలవాట్లు నేర్పండి. శుభ్రంగా వుండటం నేర్చుకుంటే, అతనిలో కొత్త ఆలోచనలు కూడా పుట్టుకు వస్తాయి.
4. వారితో ఆడండి - మీకు సమయం వున్నపుడు వారితో కేరం బోర్డ్, చెస్ వంటివి ఆడండి. ఇవి తెలివిని పెంచే ఆటలు. స్విమ్మింగ్, ఎడ్వంచెర్ క్రీడలు కూడా వారిని చురుకుగా వుంచుతాయి.
5. ఆదర్శంగా వుండండి - మీరు ఏది చేస్తే పిల్లాడు దానినే చేయ ప్రయత్నిస్తాడు. కనుక వారిపై కేకలు పెట్టక, ప్రేమ, ఆప్యాయతలతో మీరు ఆదర్శంగా వుండి ఆ పనులు వానితో చేయించండి.



Click it and Unblock the Notifications
