Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
పిల్లల పరీక్షలకు పెద్దల పాట్లు!

పిల్లలను పరీక్షలకు ఎలా తయారు చేయాలి?
1. పరీక్షలు మొదలయ్యేటందుకు రెండు లేదా మూడు వారాలకు పిల్లలకు చదివే సమయాన్ని నిర్ణయించండి.
2. పరీక్షలకు ముందు 1 లేదా 2 రోజులే ఆ సబ్జక్టు చదివించే బదులుగా ముందునుండే చదివించి పిల్లాడిని తయారు చేయండి.
3. ఉద్యోగాలు చేసే తల్లితండ్రులకు పిల్లల పరీక్షల తయారీ కష్టమే. అందుకనే వారు సాధారణంగా ప్రయివేటు ట్యూషన్లకు పంపుతారు. కాని పిల్లాడు కనుక వినయ విధేయతలతో చదువుకునే వాడైతే మీరే బోధించవచ్చు.
4. తల్లి ఉద్యోగం చేసే వారైతే ఆఫీసుకు వెళ్ళే ముందు కొంత హోం వర్కు ఇవ్వండి. తిరిగి వచ్చిన తర్వాత పిల్లాడు ఎలా చేశాడనేది పరిశీలించండి. బాగా చేస్తే, వాడిని అభినందించండి. పిల్లలు మెచ్చుకుంటే మరింత బాగా చదువుతారు.
5. పిల్లాడు సరిగా పరీక్షలకు చదవకపోతే, కఠినంగా వుండండి. తప్పటంవలన వచ్చే నష్టాలు వివరించండి. బాగా ఒత్తిడి చేయకండి. ఒత్తిడి చేస్తే వాడు చదవాల్సింది కూడా చదవక పుస్తకాలు అంటేనే భయపడతాడు.
6. పిల్లాడు సరిగా నేర్చుకోలేకపోతే, అర్ధమయ్యేలా వీలైనన్ని సార్లు చెప్పండి. మీరు సహనం వహిస్తే, పిల్లలు పరీక్షలలో బాగా వ్రాస్తారు.
7. వారికి ముందస్తు పరీక్షలు పెట్టండి. ఇది చాలా మంచిది. ప్రతి చాప్టర్ మొదట నేర్చుకోడం తర్వాత అందులో సమాధానాలు రాయటం వంటిది చేయాలి. పిల్లాడు బాగా ప్రిపేర్ అయితే, ఇక వాడికి ఇంటిలో ముందస్తు పరీక్ష పెట్టండి.
8. రివిజన్ చాలా ప్రధానం. దీనివలన పిల్లాడికి సమాధానాలు గుర్తుంటాయి. పిల్లాడు స్కూలుకు వెళ్ళేముందు రివిజన్ కు కొంత సమయం కేటాయించండి.
ఈ ఎనిమిది చిట్కాలు మీరు, మీ పిల్లాడు పాటిస్తూ వుంటే, పిల్లాడు పరీక్షలు బాగా వ్రాయవచ్చు. పరీక్షకెళ్ళేముందు పిల్లాడు బాగా రిలాక్స్ అయ్యేలా చూడండి. భయపడాల్సిందేమీ లేదని ధైర్యాన్ని అతనిలో నింపి బాగా వ్రాయగలననే విశ్వాసం చేకూర్చండి.



Click it and Unblock the Notifications
