Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కుమార్తెలను పెంచేందుకు కొన్ని చిట్కాలు!

కుమార్తెలు చిన్నపిల్లలుగా వున్నంతవరకు బాగానే వుంటుంది. వారు టీన్ ఏజ్ చేరిన వెంటనేవారిపట్ల మీ భాధ్యత మరింత పెరుగుతుంది. పెరిగే ఆడపిల్లలకు టీనేజ్ అనేది చాలా ఆవేశపూరితమైంది, ప్రమాదకరమైంది కూడాను. సాధారణంగా ఈ వయసులో ఆడపిల్లలు పెద్దలు చెప్పేదాన్ని వ్యతిరేకిస్తూంటారు. పరిపక్వత లేని స్వతంత్ర భావాలు వినిపిస్తారు. అలాగే మీ అమ్మాయి కూడాను. అబ్బాయి మిమ్మల్ని వ్యతిరేకిస్తే అది సహజమని సరిపెట్టుకుంటారు. కాని కుమార్తెలు వ్యతిరేకిస్తే, కుటుంబ పరువు ప్రతిష్టలు పాడు చేస్తున్నావంటూ ఆధారంలేని మాటలతో తిట్టిపోస్తారు. ఆడపిల్లలకు సమాజంలో నిబంధనలు యువకులకు వలే కాకుండా వేరుగా వుంటాయి. ఈ సమాజ నిబంధనలు మీరు మీ ఇంటి బయటే వదిలేయాలి. మీ ఇంటిలో కుమారుడు, కుమార్తె ఇద్దరూ ఒకటేనని భావించాలి.
అలాగని మీ కుమార్తె ఏ రకంగా వ్యతిరేకించినా చూస్తూ ఊరుకోమని మేం అనటం లేదు. మీ కుమారుడికి చెప్పినట్లే చెప్పి వారిని మీరు కరెక్ట్ చేయాలి, మార్గదర్శకతలు చూపాలి. ఆడపిల్లకు ఆడపిల్లగా పుట్టినందున ఈ నిబంధనలు పాటించాలని ఎపుడూ చెప్పవద్దు. అది వారిలో అట్టడుగున ఒక అడ్డంకిగా జీవితంలోనే వుండిపోతుంది. ఇక వారి పెరుగుదల అణచబడిన రీతిలో గడచిపోతుంది.
కుమార్తెలకు మంచి ప్రయోజనం ఏమంటే వారు సహజంగా తండ్రులతో అనుబంధం పెంచుకుంటారు. అది ఒక మానసిక ప్రక్రియ. దీనిని మీరు మీకు అనుకూలంగా మలచుకోవాలి. తల్లి కుమార్తె పెంపకంలో కట్టుదిట్టం చేయలేకపోతే తండ్రి ఆ భాధ్యత అందిపుచ్చుకోటానికి అడుగు ముందుకు వేయాలి. కుమార్తెను స్నేహపూరిత మాటలతో నియంత్రణ చేయాలి. అలాగని మీరు గారాబాలు పోయే మీ చిన్నారి యువరాణులతో పూర్తిగా ఏకమైపోకండి. తండ్రి వద్ద అతి చనువు తో క్రమశిక్షణ కొరవడితే ఇక తల్లి భాద్యతను తీసుకోవాలి. కుమార్తెలు సహజంగా తండ్రులకు దగ్గరగా వుంటారు. మరి తల్లులు కుమార్తెల పెంపకంలో ప్రత్యేక పాత్ర వహించాల్సివస్తుంది. 12 నుండి 18 సంవత్సరాల వయసులో కుమార్తె ఒక చిన్నబాతు పిల్ల దశ నుండి హంస దశకు చేరుతుంది. ఈ సమయంలో వీరికి తల్లుల అవసరం కూడా వుంటుంది.
ఆడపిల్లలలో ప్రధానంగా వచ్చే మార్పు యుక్తవయసు పొంది శారీరక మార్పులకు లోనవ్వటం. తల్లులు తమకు గల గత అనుభవంతో వచ్చే మార్పులకు కుమార్తెలు తట్టుకునేలా చేయాలి. కుమార్తెలు చాలా విలువైన వారు. ఈ చిట్కాలుపయోగించి కుమార్తెల పెంపకంలోని ఆనందాన్ని చవిచూడండి. ఆమెకుగల భాధ్యతలు సరిఅయిన క్రమంలో నిర్వర్తించేలా మార్గదర్శకతలు చూపండి.



Click it and Unblock the Notifications