Latest Updates
-
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.!
ప్రమాదంలేని 5 రకాల దీపావళి క్రేకర్లు!

ఇక పిల్లలకు సురక్షితమైన టపాకాయలంటే-
పిస్తోళ్లు - వీటిని ఏ వయసు పిల్లలైనా కాల్చవచ్చు. నిప్పుతో పిల్లలు దూరంగా వుంటారు. పేల్చటం చాలా తేలిక కనుక నిర్భయంగా వీటిని పిల్లలకు ఇవ్వవచ్చు. వీటిలో వేస్టేజ్ కూడా తక్కువ, ధ్వని పెద్దగా వుండదు.
పువ్వుల తీగలు - వీటినే కాకరపువ్వత్తులు, తాళ్ళు అని కూడా అంటారు. ఇవి పేలేవి కావు, చూడటానికి పూలవలే కురిపిస్తూంటాయి. పిల్లలు, పెద్దలు కూడా వీటిని బాగా ఆనందిస్తారు. ఇవి వివిధ సైజులలోను, వివిధ రంగులలోను వస్తాయి.
షాట్స్ - అందరూ బాగా వాడేవి. పండుగకు మంచి ఆకర్షణ. వెలిగిస్తే చాలు ఆకాశంలోకి దూసుకు వెళ్ళి అక్కడ పేలి రంగురంగుల పూలు వెదజల్లుతాయి. ఇవి దూరంగా పేలుతాయి కనుక బాధ లేదు. వీటిని కాల్చాలంటే ఒక బాటిల్ లో పెట్టి కాలిస్తే చాలు పైకి పోతాయి. అయితే పైన ఎలక్ట్రిక్ వైర్లు వంటివి లేకుండా చూడండి.
చిచ్చుబుడ్లు - పిల్లలకు దీపావళి పండుగలో ప్రధాన ఆకర్షణ. వీటిని ముట్టిస్తే చాలు. మెల్లగా పూలు విదిలిస్తూ బాగా పైకి ఎగిసిపడతాయి. ఇవి వివిధ సైజులలో, వివిధ రంగుల పూలతో వస్తాయి. వీటిని వెలిగించటానికి కాకర పువ్వత్తులను ఉపయోగించాలి.
భూ చక్రాలు - ఇవి కొద్దిపాటిగా నేలపై అటూ ఇటూ పరిగెత్తినా పేలవు, తిరుగుతూ పూలను వెదజల్లుతాయి. పిల్లలు బాగా ఆనందిస్తారు. కనుక సురక్షితమే. అయితే అవి కాలేటపుడు పక్కన ఏ ఇతర టపాసులు లేకుండా చూడండి.



Click it and Unblock the Notifications
