Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ పిల్లలు హింసా ధోరణి అవలంబిస్తున్నారా?

1. పిల్లాడు స్కూల్ నుండి ఇంటికి వచ్చి పుస్తకాల బ్యాగ్ విసిరేసి, షూస్ కూడా విసిరి అవతల పారేశాడా? అది వాడి తీవ్ర వ్యతిరేక ధోరణికి నిదర్శనం. అపుడే మీరు దానిని సరిచేయండి.
2. చేతికి అందించాల్సిన వస్తువులను సై తం విసిరి అందిస్తూంటే, దానిని సరి చేయండి. కుటుంబంలోని పెద్దలనుండి కూడా ఈ అలవాటు వారు నేర్చుకుంటారు. ముందుగా పెద్దలు ఈ పని చేస్తూంటే దానిని నిలుపండి.
3. కొంతమంది పిల్లలు, కనపడ్డ వస్తువును లేదా బొమ్మను పాడు చేసే ప్రయత్నంలో వుంటారు. అది సరికాదని, అలా చేస్తే వారు శిక్షింపబడతారని, అంతేకాని కొత్త వస్తువు లేదా బొమ్మ వంటివి తిరిగి రావని వానికి తెలిపి సరిచేయండి.
4. పిల్లాడు హింసాత్మకంగా ప్రవర్తిస్తుంటే, ఏడుపు, కేక పెట్టటం లేదా తల్లి తండ్రులను కొట్టటం వంటివి చేస్తూంటే వాడు పెద్ద అయితే మరింత తీవ్ర మొండితనానికి గురవుతాడు. ఈరోజు పిల్లాడు కనుక ఒక బొమ్మకు మారాం చేస్తే రేపు పెద్ద వస్తువులకు కూడా అదే విధంగా ప్రవర్తిస్తాడు. కనుక పిల్లవాడికి మంచి నడవడిక ఎలా? అనేది నేర్పించి సరిచేయండి.
5. టీనేజ్ వచ్చేసిందంటే వారిలో వచ్చే హార్మోన్ల మార్పు కారణంగా మీపై తిరుగుబాటు చేస్తారు. అయితే, హింసాత్మకంగా మీపై తిరుగుబాటు చేసేకంటే, మహాత్మ గాంధీవలే అహింసాత్మకంగా, చక్కటి ప్రవర్తనతో కూడా తిరుగుబాటు చేయవచ్చని వానికి తెలుపండి.
పిల్లలు హింసాత్మకంగా ప్రవర్తించటం సాధారణమే అయితే వాటికి కొన్ని హద్దులు పెట్టండి. మర్యాదగా వారి అసమ్మతిని ప్రకటించేలా నేర్పించండి.



Click it and Unblock the Notifications