Latest Updates
-
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి?
కొడుకులకే తల్లిపై అధిక ప్రేమ!

పై చదువులంటూ యూనివర్శిటీ లేదా ఇతర ప్రదేశాలకు వెళ్ళే పిల్లలలో కుమార్తెలకంటే కూడా కొడుకులే అధికంగా తమ తల్లి ఆప్యాయతలు మిస్ అయిపోతున్నారట. కుమార్తె ఒక సారి తన తల్లి నుండి విడివడి బయటకు వెళ్ళిన తర్వాత ఆమె సౌకర్యం ఆమె చూసుకోటానికి అవకాశంగా వుంటుందని, అయితే కొడుకు విషయంలో మాత్రం అతడు అప్పటివరకు తల్లి సేవలకు, ప్రేమకు అలవాటు పడినవాడు ఒక్కసారి చదువంటూ బయటకు వెళ్ళిపోవడంతో తనను తాను సముదాయించుకోడం అగమ్యగోచరంగా వుంటోందని ఒక తాజా అధ్యయనం తెలిపింది.
ఈ విధంగా ఇంటిని వదిలి వచ్చినవారు ఎప్పుడెపుడు మరల ఇంటి ముఖం పడదామా అని కూడా ప్రయత్నిస్తున్నారట. కొడుకులు ఇంటికి వెళితే రుచికరమైన భోజనం తల్లిచేతినుండి దొరుకుతుందని సర్వేలో తెలిపారట. బహుశ ఆడ పిల్లలవలే వంట చేసుకోడం వచ్చివుంటే వీరి పరిస్ధితికూడా మరోలా వుండేదేమో.
యూనివర్శిటీలలో స్వతంత్రంగా వ్యవహరించటం, కొత్త వారిని స్నేహితులు చేసుకోడం అన్నీ బాగానే వున్నాయి కాని ఇంటి సౌకర్యాలు మాత్రం లోపిస్తున్నాయని వారు చెపుతున్నట్లు రీసెర్చి వెల్లడించింది.
సర్వేలో, వచ్చి రెండు వారాలు కాకుండానే సగంమంది మగ పిల్లలు ఇంటికి ఒక సారి వెళుతున్నారని పరిశోధనలో తేలినట్లు ది డైలీ ఎక్స్ ప్రెస్ పత్రిక ప్రచురించింది.



Click it and Unblock the Notifications
