Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లల ఆహారం ఎలా వుండాలి?

పిల్లలకు ఇచ్చే ఆహారంలో కార్బొహైడ్రేట్స్‌ది ప్రధాన పాత్ర వహిస్తాయి. అయితే ఆ కార్బొహైడ్రేట్స్ ఏ రూపంలో అందిస్తున్నామనేది ముఖ్యం. తీయని పండ్ల రసాలు, చాక్లెట్స్, బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రాసెస్‌డ్ ఫుడ్స్, గోధుమలతో తయారు చేసిన బ్రెడ్, ఎక్కువగా పాలిష్ చేయని బియ్యంలాంటి వాటిలో కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా లభిస్తాయి. గుడ్లు, పాలు, వెన్న, చికెన్, చేపలు, మాంసం, పప్పు ధాన్యాలలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. పిల్లల ఆహారంలో ఇవి ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. పిల్లలకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన ఆహారంలో కొవ్వు కూడా ముఖ్యం. కొవ్వులో ఒమెగా-3 వుండేలా చూడాలి. టునా, సాల్మన్ చేపలు, నువ్వులు, వేరుశనగ, కాజూ, బాదంపప్పులలో ఒమెగా -3 అధికంగా వుంటుంది. బటర్ ఫ్రూట్, పొద్దుతిరుగుడు గింజలు, మొక్కజొన్న, బాదంలలో ఒమెగా -6 నూనెలు లభిస్తాయి.
పిల్లలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన మరో విటమిన్ కాల్షియం. ఇది ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. నరాల వ్యవస్థ సరిగా పనిచేయడానికి, కండరాల బలపడటానికి తోడ్పడుతుంది. ఎదిగే పిల్లలకు ప్రతీరోజూ కాల్షియం అవసరం ఉంటుంది. అందుకే ఎక్కువ కాల్షియం వుండే పాల ఉత్పత్తులు, నువ్వులు, రాగులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరగడానికి, పిల్లలలో ఎదుగుదలకు, పునరుత్పత్తి విధులకు ఐరన్ తప్పనిసరి. బాడీలో ఐరన్ తక్కువగా ఉంటే పిల్లలు ఎనీమియా బారిన పడే అవకాశం ఉంది. ఆకు కూరలు, డ్రై ఫ్రూట్స్, పుచ్చకాయ, బియ్యం, మాంసం, లివర్‌లలో ఇది ఎక్కువగా దొరుకుతుంది.



Click it and Unblock the Notifications