Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లల సాధారణ సమస్యలు ఎలా వ్యవహరించాలి?

మీ ప్రియమైన, అమాయకమైన చిన్నారి అకస్మాత్ గా మీరంటే కోప తాపాలు ప్రదర్శిస్తుంది. మీ మాట లెక్క పెట్టదు. కఠినమైన జవాబులు ఇస్తుంది. అప్పటివరకు ఎలా చెపితే అలా వినే పిల్ల లేదా పిల్లవాడు ఈ రకంగా ప్రవర్తిస్తుంటే, తల్లితండ్రులకు వారితో వ్యవహరించటం బహుకష్టంగా వుంటుంది. ఆ రకంగా వారు వారి వ్యక్తిగత గుర్తింపులకు చేస్తారని అనుకోండి. ఈ సమయంలో పిల్లలకు కుటుంబ సభ్యులపై కంటే కూడా వారి స్నేహితులపై సమయం వెచ్చించేందుకు అవకాశం ఇవ్వండి. వారి ఈ దశ దాటేంతవరకు మీరు సహనంతో వుండాలి. అతను లేదా ఆమె ఏం చేసినప్పటికి మీరు వారి వెనుక వున్నట్లు వారు భావించేలా చేయండి. అది వారిలో ఆత్మ విశ్వాసం నింపుతుంది.
సెల్ ఫోన్ కు అంటిపెట్టుకుని ప్రవర్తిస్తున్నాడా? నిషేధించకండి. అతనికి నిరాశ కలుగుతుంది. అయితే, అతను పంపే కాల్స్ లేదా మెసీజీలకు హద్దులు పెట్టండి. భోజన సమయం ఫోన్ లు చేయరాదని తెలుపండి. వారి మొబైల్ బిల్లు వారు చెల్లించేలా చూడండి. కంప్యూటర్ బెడ్ రూమ్ లో కంటే లివింగ్ రూమ్ లో వుంచండి. మీ పర్యవేక్షణ బాగా వుంటుంది. అనవసరంగా భావించే వెబ్ సైట్లను నిషేధించే సాఫ్ట్ వేర్ అమలు చేయండి.
మీకు తెలుపకుండా బయట అధిక సమయం గడుపుతూంటే, కారణాలు పరిశీలించండి. వారికి కొన్ని హాద్దులు పెట్టండి. ఆ సమయాలు మించితే శిక్ష వుంటుందని కూడా తెలుపండి. స్నేహితులతో అధిక సమయం గడపటం టీనేజర్లకు సాధారణమే. అందుకుగాను తల్లితండ్రులుగా వారి స్నేహితులతో కూడా మీరు పరిచయం కలిగి వుండండి. సరైన వారితో స్నేహాలు చేస్తున్నారా లేదా అనేది గమనించండి. అతని స్నేహితులను ఇంటికి పిలిచి వారితో కూడా మీరు కొంత సమయం కేటాయించండి. వారి ద్వారా కూడా మీ పిల్లల అభిరుచులు కొన్ని మీకు తెలుస్తాయి. వారు కనుక తప్పుదోవలో చెడు స్నేహాలు చేస్తుంటే, వెంటనే జాగ్రత్త పడండి. అవసరమనుకుంటే, పిల్లల విషయ నిపుణులను సంప్రదించండి.



Click it and Unblock the Notifications