Latest Updates
-
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి!
పిల్లల దగ్గు పోగొట్టాలంటే?

1. పిల్లాడిని వీలైనంతవరకు చల్లటి వాతావరణాన్ని సోకనివ్వకండి. ఉన్ని దుస్తులు వేసి శరీరం రక్షించండి. పిల్లవాడు పడుకొనే గది కూడా వెచ్చగా ఉండాలి. అవసరం అనుకుంటే రూమ్ హీటర్ వంటివి పెట్టి గది ఉష్ణోగ్రతలు మెయిన్టెయిన్ చేయండి.
2. పిల్లాడిని బాగా తేమ ఉన్నగదిలో కొద్దిసేపు వుంచితే చల్లని గాలికి దగ్గుద్వారా శ్వాసకోశంలో వున్న కఫం అంతా బయటకు వచ్చేస్తుంది. చాలా హాయిగా భావిస్తాడు. ఇంట్లోనే చేసుకోదగిన ఒక చిట్కా ఇది.
3. గదిని కొద్దిగా వేడెక్కించేందుకుగాను రూమ్ హీటర్ వంటివి వాడి కొంత ఊరట కలిగించవచ్చు. ఒకసారి బిడ్డ శరీరంలోని కఫం బయటకు పడిపోతే, అతనికి ఎంతో తేలికగా ఉంటుంది.
4. తరచుగా వచ్చే దగ్గు పిల్లవాడి నిద్రను, ప్రత్యేకించి రాత్రులందు పాడు చేస్తుంది. కనుక పిల్లాడిని పగటిపూట బాగా నిద్రించేలా చూడాలి. స్కూల్ కు వెళ్ళే పిల్లలయితే, సాయంకాలాలు ఇంటికి రాగానే కొంతసేపు నిద్రించే ఏర్పాటు చేయండి.
5. దగ్గు నివారించాలంటే, యూకలిప్టస్ బామ్ లేదా ఆలివ్ ఆయిల్ వంటివి సహజంగా వాడే ఔషధాలు. వీటిని ఆవిరిపట్టి పీల్చితే తాత్కాలికంగా చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. ఛాతీకి, ముక్కుకు, నిద్రించేముందు రాస్తే, శ్వాస బాగా ఆడి పిల్లాడు బాగా నిద్రిస్తాడు.
6. తాగేటందుకు గోరువెచ్చని నీటిని ఇవ్వండి. డాక్టర్ సలహాపై హెర్బల్ టీ కూడా తాగించవచ్చు. అయితే, టీ అతిగా తాగించి ఆరోగ్యాన్ని పాడుచేయకండి.
7. దగ్గు, జలుబులు వచ్చే పిల్లలకు శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఈ సమయంలో వీరికి ద్రవపదార్ధాలు అధికంగా ఇవ్వాలి. మంచినీరు అధికంగా తాగించండి. వేడి వేడి వెజిటబుల్ సూప్ వంటివి డీహైడ్రేషన్ తగ్గిస్తాయి. ఇన్ ఫెక్షన్ కారణంగా బాధపడే శరీరానికి మంచి ఎనర్జీ ఇస్తాయి.
8. పాలు తాగిన వెంటనే దగ్గుతూంటే, కొద్ది రోజులు పాలు పట్టకండి. ఇవి ఎలర్జీ కలిగించి దగ్గు అధికం చేస్తాయి.



Click it and Unblock the Notifications
