Latest Updates
-
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది
పిల్లలలో అవగాహనా శక్తి పెంచటమెలా?

పిల్లలు ఎలా నేర్చుకోవాలి? నేర్చుకోవడానికి ఎదురయ్యే అడ్డంకులపై స్కూలులో టీచర్, ఇంట్లో తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులకు సరైన అవగాహన ఉన్నపుడు ఆ పిల్లలకు సహాయం చేయగలుగుతారు. పిల్లలను ప్రోత్సహించాలి. పెద్దలు వారికి తమవంతు సహాయం వారి చదువులలో లేదా ఇతర పనులలో అందించాలి. వారంతటవారు ఏదైనా పనిచేసినపుడు మనస్ఫూర్తిగా పొగడాలి. చిన్నదైనా సరే ఏదో ఒక బహుమతినిచ్చి ఉత్సాహ పరచాలి. పిల్లలను దండించడం వల్ల వచ్చే లాభమేమీ లేదన్న విషయం పెద్దలు గ్రహించాలి.
మరి తల్లితండ్రులు వారికి ఏ రకంగా సహాయ పడాలి? అంటే లెక్కలు సరిగా చేయనపుడు క్యాలిక్యులేటర్ ఉపయోగించడం, వ్రాయలేనపుడు నోటితో సబ్జెక్టును చెప్పించడం, విద్యార్థిని ముందు బెంచీలో కూర్చోపెడితే స్కూలులో ఉపాధ్యాయులు వారిపై ఎక్కువ శ్రద్ధ చూపగలరు. పిల్లలకూ నేర్చుకునే విషయంపట్ల ఆసక్తి పెరుగుతుంది. కనుక వీలైనంతవరకు వారిని ముందు బెంచీలలో కూర్చోపెట్టే ఏర్పాటు చేయాలి. వీటివల్ల నేర్చుకునే పద్ధతుల్లో కొంత మెరుగుపడి చదువులో ఆసక్తి కలుగుతుంది.
నేర్చుకోవడం అనేది చుట్టూ వున్న వాతావరణంమీద ఆధారపడి వుంటుంది. సరైన ఉపాధ్యాయులు, పుస్తకాలు, నేర్చుకోవాలనే ఆసక్తి కలిగించేవాళ్లు, వారి చుట్టూ వుండాలి. పిల్లలకు మంచి మానసిక ఆరోగ్యం అవసరం. వారు మానసికంగా ఎదగలేకపోవడం కారణం ఆందోళన అనవసర భయాలు గా వుంటాయి. ఇవి చదువులో అడ్డువస్తాయి. వారు వెనకబడేలా చేస్తాయి. వీటిని పెద్దల సహకారంతో సులువుగా పిల్లలు అధిగమించి విజయాలు సాధిస్తారు. కనుక పెద్దలు పిల్లలకు వారి అభివృద్ధిలో నిరంతరం సహకరిస్తూవుండాలి.



Click it and Unblock the Notifications