Latest Updates
-
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
తల్లితండ్రుల పోట్లాటలు....పిల్లల బెంగలు?

ప్రత్యేకించి వీరి తగవులు, అపుడపుడే ఊహ తెలుస్తున్న చిన్నారులకు సమస్యగా వుంటుంది. తగవు ప్రభావం వీరి ప్రవర్తనపై పడుతుంది. వీరు చిన్నగా తగవులాడుకున్నా సరే బిడ్డ కనుక బాగా సున్నిత మనస్కుడైతే వానిపై ప్రభావం తీవ్రంగా వుంటుంది. దానికి కారణం అతను చూస్తున్న మొట్టమొదటి వ్యక్తులు తల్లితండ్రులు కావటమే. వారిలో ఆందోళన, నిస్సహాయత, చోటుచేసుకుంటాయి. కొన్నిమార్లు తల్లితండ్రుల తగవుల కారణంగా, వాటిని ప్రత్యక్షంగా చూసే చిన్న పిల్లలు ఎంతో నష్టపోయే స్ధితికి వస్తారు. మనోఘాతమై మరోమారు కోలుకోలేని స్ధితికి కూడా వచ్చేస్తారు.
తల్లితండ్రులమధ్య ఎంత చిన్న తగవు అయినప్పటికి పిల్లల మనసులు వాటిని తట్టుకోలేవు. బేబీ లేదా పిల్లవాడిలో ఎంతో ఒత్తిడి కలిగించి వారిని ఆ జ్ఞాపకాలు జీవితాంతం వెంటాడుతూనే వుంటాయి. తాజాగా చేసిన ఒక సర్వేలో రీసెర్చర్లు షుమారు 532 మంది పిల్లలను వారి తల్లితండ్రులను అధ్యయనం చేశారు. తల్లితండ్రుల హింసాత్మక ప్రవర్తనకు పిల్లల మానసిక వ్యధకు ఎంతో దగ్గర సంబందం వున్నదని కనుగొన్నారు. వీరు నిర్వహించిన పరిశోధాన చాలావరకు పట్టణ ప్రాంతాల పిల్లలపైనే జరిగింది.
కనుక తల్లి తండ్రులు తమ పిల్లల ముందు హింసాత్మక ధోరణిలో తగవులు చేసుకోకుండా తమ స్పర్ధలను పోగొట్టుకోవాలని, ఏదేని జరిగినప్పటికి అటువంటివి తమ పిల్లలముందు జరుగకుండా చూసుకోవాలని, ఇది పిల్లలకు ఎంతో మంచిదని అంతేకాక, తల్లితండ్రుల, పిల్లల మధ్య సంబంధాలు కూడా చెడకుండా వుంటాయని రీసెర్చర్లు వెల్లడించారు.



Click it and Unblock the Notifications
