Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ బిడ్డ సరైన డే కేర్ లో వున్నాడా?

బిడ్డకు సౌకర్యం కొద్దిగా తగ్గినప్పటికి సురక్షితం లేదా భధ్రత అనేది ప్రధానమని గమనించండి.
పరిశీలించవలసిన అంశాల జాబితా?
దూరం - బిడ్డ డే కేర్ సెంటర్ మీ ఇంటికి లేదా పని ప్రదేశానికి దగ్గరగా వుందా? లేదా చూడండి. అత్యవసరమైనపుడు మీరు వెంటనే చేరవలసి ఉంటుంది. ఏదేని అవాంఛనీయ సంఘటన జరిగితే మీ బిడ్డ మీ కొరకు ఎదురు చూడరాదు.
కెమెరాలు - డే కేర్ సెంటర్ లో సిసిటివి కెమేరాలున్నాయా గమనించండి. ప్రతిరోజూ సాయంత్రం అయ్యే సరికి మీ బిడ్డ డే కేర్ సెంటర్ లో ఏం చేశాడనేది వారు మీకు వీడియో సిడి తీసి ఇచ్చేస్తారు. మీ బిడ్డకు సెంటర్ లో చక్కటి ట్రీట్ మెంట్ లభించిందనేదానికి ఇదే నిదర్శనంగా వుంటుంది.
శిక్షణ పొందిన ఆయాలు - మీ బిడ్డను సెంటర్ లో సంరక్షించే ఆయాలు సరి అయిన శిక్షణ కలిగిన వారేనా అనేది గమనించండి. అత్యవసర పరిస్ధితులలో సెంటర్ యాజమాన్యం నిపుణతలేని ఆయాలను కూడా ఎంపిక చేస్తుంది. కనుక వారి సర్టిఫికేట్లు పరిశీలించి మీరు మీ బిడ్డను చేర్పించండి. అంతేకాదు, ఆయాలకు క్రిమినల్ రికార్డు ఏదీ లేదనేది కూడా నిర్ధారించుకోండి. ఎందుకంటే, వీరిలో పిల్లలను ఎత్తుకుపోయే వారు కూడా వుంటారు.
ప్రాధమిక వైద్య సౌకర్యాలు - మీరు ఎంచుకునే డే కేర్ సెంటర్ లో ప్రాధమిక ఆరోగ్య సౌకర్యాలు తప్పని సరిగా వుండాలి. వారు బిడ్డల జ్వరం, నొప్పులు, డయోరియా వంటి వాటికి వాడే మందులు కలిగి వుండాలి. కాని ఒక తల్లి ఉద్యోగినిగా మీ అనుమతి లేకుండా మీ బిడ్డకు వారు ఏ రకమైన మందులు వాడకుండా చూడండి. అంతేకాదు, మీరు అలర్జీ కలిగించే ఆహారాలు మీ బిడ్డకు ఇవ్వరాదని చెపుతూ, ఏ ఆహారాలు మీ బిడ్డకు ఎలర్జీ కలిగిస్తాయనేది వారికి తెలుపండి.
ఆరోగ్యకర ఆహారం - డే కేర్ సెంటర్ లు చాలావరకు వారే బిడ్డకు ఆహారం ఇస్తారు. కొద్దిమంది మాత్రమే, ఇంటి నుండి ఆహారం తెచ్చుకునేందుకు అంగీకరిస్తారు. కనుక ఇంటి ఆహారం అనుమతించే డే కేర్ ని మాత్రమే మీరు ఎంచుకోండి. మీ బిడ్డకు అవసరమైన పోషకాహారం బాగా అందుతుంది.బిడ్డ కనుక సెంటర్ ఆహారం తినేట్లయితే, ఆహారం మంచి నాణ్యమైనదిగా ఉండేలా చూడండి.
ఉద్యోగస్తులు తాము పని ప్రదేశంలో వుండి కూడా పిల్లలపట్ల ఆందోళన చెందుతారు. కనుక డే కేర్ ఎంపికలోనే పూర్తి అంశాలు పరిశీలించి మీ బిడ్డను ఆ సెంటర్ లో చేర్పించండి. తల్లి ఆలనా పాలనాకు మించినదేదీ లేదు. కాని మీ అవసరం అటువంటిది కనుక చేర్పించేముందు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని బిడ్డ పెరుగుదలను ఆనందించండి.



Click it and Unblock the Notifications