Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటిలో పిల్లలు ఒంటరిగా వున్నారా?

1. బేబీకి ఎవరైనా ఆయాని పెట్టారా? పెట్టిన ఆయా నమ్మకమైనదిగా వుండాలి. తెలియనివారిని నియామకం చేయకండి. తెలియని వారిని పెట్టుకుంటే మరింత ప్రమాదకరంగా తయారవుతుంది.
2. బయటకు వెళ్ళేటపుడు తప్పని సరిగా పిల్లలకు లేదా ఆయాకు మీకు మెసేజ్ అందే ఎమర్జెన్సీ నెంబర్లు ఇవ్వండి. ఒక ల్యాండ్ లైన్ టెలిఫోన్ నెంబర్ కూడా ఇస్తే, మొబైల్ కు కవరేజ్ లేకుంటే కనీసం దాని ద్వారా మీకు మెసేజ్ అందుతుంది.
3. పిల్లలను ఇంటిలో పెట్టి తాళం పెట్టకండి. ఏదైనా అగ్నిప్రమాదం వంటివి జరిగితే వారు బయటకు రాలేరు. పిల్లలకు ఇంటి లో నుండి బయటకు రావద్దని తెలుపండి. లేదా మీ పొరుగు వారికి పిల్లలను చూస్తూ వుండమని తెలుపండి.
4. పిల్లలకు తలుపులు వేసి లోపల గొళ్ళెం లేదా బోల్ట్ పెట్టుకోవడం నేర్పించండి. తల్లితండ్రులు లేని సమయంలో ఇండ్లలో దొంగలు పడటం సామాన్లు ఎత్తుకెళ్ళడం వంటివి ఎన్నో జరుగుతూంటాయి. మీరు వెళ్ళే ముందు ఒకసారి బిడ్డను గొళ్ళెం పెట్టుకోవడం రిహార్సల్ వేయమనండి.
5. ఇంటి మొత్తం మీద పిల్లలకు వంటగది ప్రమాదకరమైనది. కనుక దానిని తాళం వేయండి. వారికవసరమైన ఆహారం బయట పెట్టండి. లేదా స్టవ్ వంటివి గ్యాస్ ఆపుచేసి జాగ్రత్త పడండి. పదునైన కత్తులు, ఫోర్కులు మొదలైనవి వారికి అందకుండా పైన పెట్టండి. రిఫ్రిజిరేటర్ వంటివి కిచెన్ కు బయట వుంచితే, సౌకర్యంగా వుంటుంది.
6. టెలివిజన్ సమయం - మీరు ఇంటిలో లేరని తెలిస్తే చాలు పిల్లలు, రీమోట్ పట్టి రోజంతా టీ.వీ చూస్తూ కాలం గడిపేస్తారు. మీరు ఛైల్డ్ లాక్ వేసిన ఛానెల్స్ కూడా చూస్తారు. అందుకని రిమోట్ అందకుండా దాచేయండి. మేన్యువల్ గా వారికవసరమైన ఛానెల్ పెట్టి తగిన సమయం వరకే పెట్టాలని తెలుపండి.



Click it and Unblock the Notifications