Latest Updates
-
రోజుకో పెగ్గు ఆరోగ్యానికి మంచిదా?..మీకు ఈ నిజం తెలుసా? -
రెచ్చిపోయి తినేంత రుచి..అరిటాకులో పొట్లం చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా! -
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్ -
పెళ్లై ఏళ్లు గడిచాక చాలా జంటలు భార్యాభర్తలుగా కాదు, రూమ్మేట్లలా జీవిస్తున్నారు మీరూ ఇలాంటివారేనా? -
మీ రాశి చక్రం ప్రకారం పడక గదిలో ఏ కలర్ పెయింటింగ్ వేస్తే మంచిదో తెలుసా.? -
రాజస్థాన్ ఫేమస్ లాల్ మాస్..మటన్ కూర ఇలా వండితే గిన్నెలో ఒక్క ముక్క కూడా మిగలదు! -
ఈ ఫ్రూట్తో పురుషుల్లో ఎనర్జీ రెట్టింపు.. శిలాజిత్ కంటే మోస్ట్ పవర్ఫుల్.! -
లక్ష్మీదేవి సముద్రం నుండి ఎందుకు పుట్టింది? దాచిన పురాణ కథ -
జూన్ 6 గ్రహ సంచారం: కుంభరాశిలో చంద్రుడి ప్రయాణం.. ఈ రాశుల వారికి అదృష్టం, సంపద వెల్లువ! -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి శని దేవుని ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - శనివారం, 06 జూన్ 2026
చలికాలంలో పిల్లల ఆరోగ్య సమస్యలు!
పిల్లల దగ్గు ఎలా నివారించాలి? పిల్లలలో సాధారణంగా చలికాలంలో దగ్గు వస్తూ వుంటుంది. దగ్గినపుడు ఊపిరితిత్తులలో వున్న మృతకణాలు బయటకు వచ్చేస్తూంటాయి. పిల్లలలో దగ్గు జలుబు, జ్వరం మొదలైనవి వచ్చినపుడు సహజంగా వస్తుంది. అది వచ్చిన ఒకటి లేదా రెండు వారాల్లో తగ్గకపోతే, బ్రాంకైటిస్ లేదా న్యూమోనియాకు దోవతీస్తుంది. ఇటువంటపుడు డాక్టర్ ను వెంటనే సంప్రదించి తగిన మందులు వాడండి. పిల్లాడిని వీలైనంతవరకు చల్లటి వాతావరణాన్ని సోకనివ్వకండి. ఉన్ని దుస్తులు వేసి శరీరం రక్షించండి. పిల్లాడిని బాగా తేమ ఉన్నగదిలో కొద్దిసేపు వుంచితే చల్లని గాలికి దగ్గుద్వారా శ్వాసకోశంలో వున్న కఫం అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంట్లోనే చేసుకోదగిన ఒక చిట్కా ఇది.

గదిని కొద్దిగా వేడెక్కించేందుకుగాను రూమ్ హీటర్ వంటివి వాడి కొంత ఊరట కలిగించవచ్చు. దగ్గు పిల్లాడి నిద్రను, ప్రత్యేకించి రాత్రులందు పాడు చేస్తుంది. కనుక పిల్లాడిని పగటిపూట బాగా నిద్రించేలా చూడాలి. దగ్గు నివారించాలంటే, యూకలిప్టస్ బామ్ సహజంగా వాడే ఔషధం. దీనిని ఆవిరిపట్టి పీల్చితే చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. ఛాతీకి, ముక్కుకు, నిద్రించేముందు రాస్తే, శ్వాస బాగా ఆడి పిల్లాడు బాగా నిద్రిస్తాడు. తాగేటందుకు గోరువెచ్చని నీటిని ఇవ్వండి. డాక్టర్ సలహాపై హెర్బల్ టీ కూడా తాగించవచ్చు. ద్రవపదార్ధాలు అధికంగా ఇవ్వాలి. వెజిటబుల్ సూప్ వంటివి డీహైడ్రేషన్ తగ్గిస్తాయి. ఇన్ ఫెక్షన్ కారణంగా బాధపడే శరీరానికి మంచి ఎనర్జీ ఇస్తాయి. పాలు తాగిన వెంటనే దగ్గుతూంటే, కొద్ది రోజులు పాలు పట్టకండి. ఇవి ఎలర్జీ కలిగించి దగ్గు అధికం చేస్తాయి.
పిల్లలలో వచ్చే దంత సమస్యలు - ఈ కాలంలో పిల్లలకు కొన్ని దంత సమస్యలు కూడా అధికంగా వస్తాయి. పిల్లలలో దంత క్షయాన్ని అరికట్టాలంటే, ముందుగా వారికి చేతనయ్యేటంతవరకు పెద్దవారే వారి దంతాలు ప్రతిరోజూ రెండు సార్లు బ్రష్ చేయాలి. కాల్షియం అధికంగా వుండే ఆహారాలైన పాలు, గింజలు మొదలైనవి ఇస్తే వారికి మంచి దంత సంరక్షణ కలుగుతుంది. కేవిటీలు రాకుండా వుంటాయి. పిల్లల దంతాలు కేవిటీలు లేకుండా ఆరోగ్యంగా వుండాలంటేవారికి ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ క్రమం తప్పకుండా ప్రతిరోజూ తినిపించాలి.
పిల్లలు చిన్నవారుగా వున్నపుడే వారికి దంతాలను ఎలా సంరక్షించుకోవాలనేది నేర్పాలి. ప్రతిరోజూ రెండు సార్లు బ్రషింగ్ చేయాలని, సంవత్సరానికొకసారి దంతాలను దంత వైద్యుడివద్ద పరీక్షింపచేయాలని తెలుపాలి. పిల్లలలో దంతాలకు తరచుగా కేవిటీలు ఏర్పడతాయి. వీటిని నివారించాలంటే తీపి పదార్ధాలు, కూల్ డ్రింకులు వంటివి వారికి భోజనానికి భోజనానికి మధ్య ఇవ్వరాదు. భోజనం లేదా స్నాక్స్ వంటివి నిర్దేశిత సమయాలలో ఇవ్వాలి. దంత సంరక్షణ ఆహారాలైన తాజా పండ్లు, కూరగాయలు, జున్ను, గట్టిగా నమిలే కాయలు వంటివి తినిపించాలి. వివిధ రకాల బ్రషింగ్ ఛార్టులు, దంత సంరక్షణా ఫొటోలు వంటివి చూపుతూ వారిలో దంత సంరక్షణ పట్ల అధిక అవగాహన చిన్నతనంలోనే కలిగించాలి.



Click it and Unblock the Notifications