Latest Updates
-
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.! -
ముఖం ఉబ్బిందా? మెడ నల్లబడిందా? ఫ్యాటీ లివర్ కు ఇవే తొలి సంకేతాలు!
దగ్గు సహజంగా పోగొట్టాలంటే!

1. పిల్లాడిని వీలైనంతవరకు చల్లటి వాతావరణాన్ని సోకనివ్వకండి. ఉన్ని దుస్తులు వేసి శరీరం రక్షించండి.
2. పిల్లాడిని బాగా తేమ ఉన్నగదిలో కొద్దిసేపు వుంచితే చల్లని గాలికి దగ్గుద్వారా శ్వాసకోశంలో వున్న కఫం అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంట్లోనే చేసుకోదగిన ఒక చిట్కా ఇది.
3. గదిని కొద్దిగా వేడెక్కించేందుకుగాను రూమ్ హీటర్ వంటివి వాడి కొంత ఊరట కలిగించవచ్చు.
4. దగ్గు పిల్లాడి నిద్రను, ప్రత్యేకించి రాత్రులందు పాడు చేస్తుంది. కనుక పిల్లాడిని పగటిపూట బాగా నిద్రించేలా చూడాలి.
5. దగ్గు నివారించాలంటే, యూకలిప్టస్ బామ్ సహజంగా వాడే ఔషధం. దీనిని ఆవిరిపట్టి పీల్చితే చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. ఛాతీకి, ముక్కుకు, నిద్రించేముందు రాస్తే, శ్వాస బాగా ఆడి పిల్లాడు బాగా నిద్రిస్తాడు.
6. తాగేటందుకు గోరువెచ్చని నీటిని ఇవ్వండి. డాక్టర్ సలహాపై హెర్బల్ టీ కూడా తాగించవచ్చు.
7. ద్రవపదార్ధాలు అధికంగా ఇవ్వాలి. వెజిటబుల్ సూప్ వంటివి డీహైడ్రేషన్ తగ్గిస్తాయి. ఇన్ ఫెక్షన్ కారణంగా బాధపడే శరీరానికి మంచి ఎనర్జీ ఇస్తాయి.
8. పాలు తాగిన వెంటనే దగ్గుతూంటే, కొద్ది రోజులు పాలు పట్టకండి. ఇవి ఎలర్జీ కలిగించి దగ్గు అధికం చేస్తాయి.



Click it and Unblock the Notifications
