Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
పిల్లలను అతిగారాబం చేస్తే..జరిగే అనర్థాలెన్నో...
చిన్నప్పటి నుంచి పిల్లలను ఎక్కువగా గారాబం చేయకూడదు. ఎందుకంటే అతి గారాబం వల్ల పిల్లలు చెడిపోయే ప్రమాదం వుంది. అతి గారాబం చేయటం వల్ల పిల్లలను పాడు చేసిన వారమవుతాము. ప్రతీ ఒక్కరికి పిల్లల మీద ఎక్కువ ప్రేమే వుంటుంది. అదిసృష్టి సహజం. ఎందుకంటే పిల్లల మీద తల్లిదండ్రులకు ప్రేమ లేకపోతే వారిని చిన్నప్పటినుంచి ప్రేమతో పెంచటం సాధ్యం కాదు. మనకు పిల్లల మీద ఎంత ప్రేమ వున్నా చేయవలసిన పనిని చేయవలసిన రీతిలోనే చేయాలి. అంతకంటే ఎక్కువ చేయకూడదు. పిల్లలు ఏది కోరుకుంటే అది ఇవ్వటం అనేది చిన్నప్పటినుంచి వారికి అలవాటు చేయరాదు. చిన్నప్పడు ఏదైతే నేర్చుకుంటారో పెద్దయ్యాక కూడా అదే అలవాటు అవుతుంది. చిన్నతనం నుంచి కూడా వారు ఏది చెప్తే అది చేయకూడదు.
వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి ఆ పని మాత్రమే చేయాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచి మంచి మాటలు, మంచి అలవాట్లు నేర్పాలి. పిల్లల మీద వున్న ప్రేమతో వారు చాలా పుష్టిగా వుండాలని అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ వారి చేత తినిపిస్తుం టారు.
ఆటపాటలతో గడపాల్సిన బాల్యం.. ఆన్‌లైన్‌తో కాలక్షేపం చేస్తోంది. పాఠశాల స్థాయి నుంచే నెట్, స్మార్ట్‌ఫోన్లను వాడడం ఆందోళన కలిగిస్తోంది. తొమ్మిదో తరగతి చదివే విద్యార్థి, తోటి విద్యార్థిని లైంగిక వేధించడం భయం కలిగిస్తోంది. మేము బాగానే పెంచాం. మా పిల్లాడు మంచిగా చదువుతున్నాడు అని ప్రతి తల్లిదండ్రులు చెప్తారు. కానీ.. తప్పు ఎక్కడ జరుగుతుందో తెలియడం లేదు. అవేంటో ముందే తెలుసుకొని మసలుకోవాలి.

1. అన్ని వసతులున్న కార్పొరేట్ పాఠశాలలో చేర్పించడమే తల్లిదండ్రుల బాధ్యత కాదు. ప్రాథమికదశలోనే వారికి మంచి అలవాట్లను, నడవడికను నేర్పాలి. వారి కోసం కొంత సమయం కేటాయించాలి.
2. అతిప్రేమ, అతిప్రోత్సాహం వల్ల పిల్లలు, తల్లిదండ్రుల మధ్య మరింత అంతరం పెరుగుతుంది. తల్లిదండ్రులిద్దరూ అతిప్రేమ చూపించడం వల్ల గారాబంగా పెరుగుతారు పిల్లలు. కొన్ని విషయాల్లో ఎవరోఒకరు కఠినంగా ఉండాలి. ఏదైనా తప్పుచేసినప్పుడు అలా చేయడం కరెక్ట్ కాదు అని సున్నితంగా చెప్పాలి.
3. చదువులో వెనుకబడితే.. ఇతర పిల్లలతో పోలుస్తూ పసిమనసుల్ని గాయపర్చొద్దు. లోపం ఎక్కుడుందో తెలుసుకొని సరిదిద్దండి. చదువులో కాకుండా దేనిపైన ఆసక్తో తెలుసుకొని ఆ దిశగా ప్రోత్సహించండి.
4. లేస్తూనే బడికి, వస్తూనే ట్యూషన్.. ఇక వారికి ఆటలాడుకునే సమయం ఎక్కడిది? దొరికిన కాస్త సమయాన్ని వీడియోగేమ్‌లతో గడిపేస్తుంటారు. ఆ సమయంలో వారిని తప్పనిసరిగా గమనించాలి. టాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లు ఇవ్వొద్దు.
5. కేవలం ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి పిల్లల చదువును బేరీజు వేయడానికి వీలులేదు. చదువుల్లో ఫస్ట్ ఉన్నా నెలకోసారి స్కూల్ టీచర్స్‌ను సంప్రదించడం మంచిది.
6.సెలవులొస్తే పిల్లలకు పండుగే. చాలామంది తల్లిదండ్రులు మల్టీఫ్లెక్స్ మూవీకో, పిజ్జాహట్‌కు తీసుకెళ్తుతుంటారు. ఓ సినిమాను చూపించడం వల్ల ఆ ప్రభావం తొమ్మిదిరోజుల దాకా ఉంటుంది. సెలవు దినాల్లో చరిత్రాత్మక స్థలాలకు, విహారయాత్రలకు, లైబ్రరీలకు తీసుకెళితే కొత్త ప్రదేశాలు పరిచయమవుతాయి.
7. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులే కావడం వల్ల పిల్లలు ఏ సమయంలో ఏం చేస్తున్నారో పట్టించుకునే తీరికే ఉండడం లేదు. దీంతో పిల్లల సంరక్షణ ఆయాలకు అప్పగిస్తున్నారు. ఇది అస్సలు మంచిదికాదు.



Click it and Unblock the Notifications
