Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
ప్రసవించిన మహిళలకు క్యాబేజీ చేసే మేలు!

స్తనాల వాపును తగ్గించటానికి పచ్చటి కేబేజి ఆకులను పాలనిపుణులు సూచిస్తారు. మహిళలకు గల ఈ గట్టిపడే స్తనాల సమస్య పరిష్కారానికి ఆచరించే ఈ చర్య సుమారు 18వ శతాబ్దం నాటి నుండి పాటిస్తున్నట్లు తెలుస్తోంది. పచ్చటి కేబేజిలో సినిగ్రిన్, రేపైన్, మస్టర్డ్ ఆయిల్, మెగ్నీషియం, ఆక్సీలేట్, సల్ఫర్ హెటిరోసైడ్స్, యాంటీబయోటిక్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మొదలైనవి వుంటాయి. క్యాబేజీ ఆకు కూర చాలా తక్కువ కేలరీలు కల ఆహారం. కేబేజి సూపుగా చేసుకొని తాగవచ్చు. రోజులో మొత్తంగా కేబేజి సూప్ ను మూడు నుండి నాలుగు సార్లవరకు తీసుకొనవచ్చు. కాన్పు తరవాత వచ్చే అధిక బరువు సమస్యను కూడా మహిళలు ఈ సూప్ తాగటం ద్వారా నిరోధించుకోవచ్చు. కేబేజీ తో పాటు కొన్ని పండ్లను, అన్నాన్ని, ఉడకపెట్టిన కూరలను కూడా ఆహారంగా తీసుకోవచ్చు.
నీటిలో తడిపిన కేబేజి ఆకులను స్తనాలపై వుంచి స్తనాల నొప్పిని నివారించుకోవచ్చు. తక్షణం ఉపశమనం పొందాలంటే, కేబేజి ఆకులను మెత్తగా నూరి స్తనాలకు రాయవచ్చు. స్తనాలు నొప్పిగా వున్నప్పటికి వాటిని గట్టిగా ఒత్తి పాలు బయటకు తెప్పించకండి.పాలు పట్టిన తర్వాత కేబేజి ఆకులను స్త్రీలు తమ బ్రాలో పెట్టుకొని వైద్యం కొనసాగించవచ్చు.



Click it and Unblock the Notifications
