Latest Updates
-
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
బిడ్డ పుడితే బాలింత శరీరంలో మార్పులు!

మహిళకు విపరీతమైన నొప్పులు ఏర్పడతాయి. బిడ్డ పుట్టిన మొదటి 12 గంటలలో మహిళకు రక్తస్రావం అధికంగా అయి మెల్లగా తగ్గుముఖం పడుతుంది. ఆమె కటి ప్రదేశం క్రమేణా బలం పుంజుకుంటుంది. దీనికిగాను ఆమె గర్భవతిగా వున్నపుడు, బిడ్డ పుట్టిన తర్వాత కూడా వ్యాయామాలు చేయాల్సివుంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత మూత్రం పోయడం ఆమెకు చాలా కష్టంగా వుంటుంది. అందునా, కుట్లు పడితే మరింత బాధాకరం. మొదటి ఒకటి రెండు రోజులలో మూత్రం అధికంగా వస్తుంది. దానిలో కొన్ని ద్రవాలు బయటకుపోతాయి.
ఆమె స్తనాలు బిడ్డ పుటుక తర్వాత మార్పు చెందుతాయి. హార్మోన్ లెవెల్ పెరుగుతుంది. అది స్తనాలలో రక్త ప్రసరణ అధికం చేస్తుంది. పాలు ఉత్పత్తి అవుతాయి. మూడవ లేదా నాల్గవ రోజునుండి పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. స్తనాలు పెరగటం ఆమెకు ఎంతో అసౌకర్యంగా వుంటుంది. క్రమేణా స్తనాలు పాల ఉత్పత్తికి సర్దుబాటు చేసుకుంటాయి. బాలింత దశలో మహిళకు అలసట, వెన్ను నొప్పి, స్తనాల సమస్యలు, మూల శంఖ, మలబద్ధకం, డిప్రెషన్, రక్తహీనత, తలనొప్పి, మూత్ర సమస్యలు వంటివి వుంటాయి. ఈ సమస్యల పరిష్కారానికిగాను ఆమె అనుభవజ్ఞులైన వైద్యులు, లేదా నర్సుల సహాయ సహకారాలు పొందాలి.



Click it and Unblock the Notifications
