Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
బేబీతో ఆనందాలు రెట్టింపు చేసుకోండి!

మరి బేబీతో ప్రతి నిమిషం ఎలా దగ్గరై ఆనందించాలి? మీ బేబీని డైలీ రొటీన్ లో పెట్టండి. వంట చేస్తున్నా, వాషింగ్ చేస్తున్నా మీ బేబీని వీపుకుగల సంచీలో తగిలించుకోండి. మీ కాలనీ ఇరుగుపొరుగుల ఇండ్లకు వెళ్ళేటపుడు బేబీని స్ట్రాలర్ లో వుంచి తిప్పండి. దోవలో మీరు చూస్తున్నవి బేబీకి వివరించండి. ఆకులు ఏరి చేతికి ఇవ్వండి. పూలను వాసన చూపండి.
బేబీకి అర్ధం అయినా కాకపోయినా, మీరు ఆరోజు ఏం చేయాలనుకుంటున్నారనేది చెపుతూ వుండండి. త్వరలోనే బేబీ మీ మాటలు పట్టుకుంటుంది. మీ స్వరధ్వనికి స్పందిస్తుంది. మీ ముఖ కవళికలకు స్పందిస్తుంది.
మీ బిడ్డతో ఇంటి వెనుక ఆడుకుంటున్నారా? కొనసాగించండి. డిన్నర్ టైమ్ అంటూ ఆ ఆనందాన్ని దూరం చేసుకోకండి. బిడ్డపై మీ దృష్టి పెట్టండి. టెలిఫోన్లు, ఇతర ఆటంకాలను పక్కన పెట్టేయండి. ఎమర్జెన్సీ అయితే తప్ప బిడ్డనుండి దూరం కాకండి.
మీ బిడ్డతో మీరు పంచుకునే ఆనందంలో మీ భాగస్వామిని సైతం చేర్చుకోండి. మీ ఆనందం మరింత రెట్టింపు అవుతుంది. మీ బేబీకి మీకిష్టమైన పాట వినిపించండి. అందరూ కలసి డ్యాన్స్ చేయండి. లేదా బెడ్ టైం కధలు చెప్పుకోండి. మీరు మీ భర్త కలసి చేసే చర్యలతో మీ బిడ్డ మొఖంలో ఆనందం రెట్టింపు అవడం చూస్తారు.



Click it and Unblock the Notifications