Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
కొత్తగా తల్లియైన వారు వెన్నునొప్పికి తీసుకోవలసిన జాగ్రత్తలు...

డెలివరీ తర్వాత బిడ్డకు పాలిచ్చే విధానం ఎంతో ముఖ్యం. మీరు ముందు నాలుగు నెలలు కూర్చుని బిడ్డకు పాలిచ్చిన పద్ధతే సరైనది. పడుకుని బిడ్డకు పాలిచ్చే పద్ధతిలో నడుంపై చాలా ఒత్తిడి ఏర్పడుతుంది. దీని వల్ల, బిడ్డ పుట్టిన తర్వాత ఉండే పనుల ఒత్తిడి వల్ల నడుం నొప్పి తీవ్రమవవచ్చు. డెలివరీ అయ్యాక పథ్యం భోజనం అంటూ పాలు, పెరుగు తీసుకోకపోవడం, అలాగే ఎక్కువ సేపు బిడ్డను ఎత్తుకొని తిరగడం వంటివి కూడా ఈ నొప్పిని మరింత తీవ్రం చేస్తాయి. అందువల్ల మీరు ఈ కింది జాగ్రత్తలు పాటించండి.
మీ శరీరం పూర్వ స్ధితికి రావాలంటే డెలివరీ తదనంతరం కొన్ని వ్యాయామాలు చేయాల్సి వుంటుంది. బాగా సాగిన పొట్ట తగ్గటానికి ఈ వ్యాయామాలు ఉపయోగపడతాయి. గర్భవతి దశలో వంటికి పట్టిన నీరు, కొవ్వు అంతా క్రమేణా తగ్గటం మొదలవుతుంది. వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తుంటే ఆరు వారాల్లో మీ సాధారణ బరువును తిరిగి పొందుతారు.
ప్రసవం తర్వాత బేబీను ఎత్తుకోవడానికి పూర్తిగా వంగకుండా బేబీను దగ్గరగా తీసుకొని తర్వాత ఎత్తుకోవాలి. ప్లోర్ మీద పడుకోబెట్టిన బిడను తల్లి చేతుల్లోకి తీసుకోవడానికి నడుమును పూర్తిగా వంచంకుండా, మోకాళ్ళను పూర్తిగా వంచి తర్వాత ఎత్తుకోవాలి.
ప్రెగ్నెన్సీ సమయంలోనూ, డెలివరీ తర్వాత సమతులమైన పౌష్టికాహారం తీసుకోవడం
వీలున్నంత వరకు నిటారుగా ఉండే పద్ధతిలో నడుం ఉండేలా చూసుకోవడం బిడ్డకు పాలిస్తున్నంత కాలం క్యాల్షియం మాత్రలు వాడటం
సాధారణ పెయిన్ రిలీఫ్ బామ్ రాసుకొని నొప్పి నుండి ఉపశమనం పొందడం
ఎత్తు మడమలు ఉన్న చెప్పులు వాడకపోవడం
ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, నొప్పి కొనసాగుతున్నట్లయితే ఆర్థోపెడిక్ డాక్టర్‌ను కలిసి సమస్యను పరిష్కరించుకోండి.



Click it and Unblock the Notifications
