Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సిజేరియన్ అంటే ఏమిటి? అది ఎపుడు చేస్తారు?

సి - సెక్షన్ కాన్పు... యోనిద్వారా జననం సాధ్యం కానపుడు, కాన్పు తల్లికి, బిడ్డకు సురక్షితం కాదని నిర్ధారించినపుడు చేస్తారు. మహిళ మెళకువలో వుండగానే ఛాతీ నుండి కాళ్ళ వరకు ఆమెకు ఎపిడ్యూరల్ లేదా స్పైనల్ ఎనస్తీషియాను ఇచ్చి ఈ సర్జరీ చేసి బిడ్డను బయటకు తీస్తారు. యోని పైభాగంలో పొట్టకు సర్జన్ చిన్న కోత పెట్టటం ద్వారా ఈ ఆపరేషన్ నిర్వహిస్తారు. గర్భాశయం, మరియు ఉమ్మినీటి సంచి తెరువబడి, బేబీ జననం చేయబడుతుంది.
బేబీ బయటకు తీయబడిన వెంటనే, వైద్య సిబ్బంది బేబీ నోటిలో, ముక్కులలో వున్న ద్రవాన్ని తొలగిస్తారు. బేబీ బొడ్డు తాడు కోయబడి ముడివేయబడుతుంది. వైద్యుడు లేదా నర్సు పుట్టిన బిడ్డ శ్వాస సాధారణంగా వుందా, బేబీ బయటి వాతావరణానికి నిలబడిందా? అనేది పరిశీలిస్తారు. తల్లి స్పృహతోనే వుంటుంది. ఆమె బేబీ ఏడ్పు వినటం, చూడటం కూడా చేస్తుంది. తండ్రి లేదా మరొకరు ఆమెకు డెలివరీ సమయంలో ఆధారంగా నిలబడతారు.
ఈ పద్ధతి ఎందుకు పాటించాలి?
సిజేరియన్ ఆపరేషన్ తో డెలివరీ చేయాలనే నిర్ణయం వైద్యులు చేస్తారు. డెలివరీ ప్రదేశం, మహిళకు గతంలో గల కాన్పులు లేదా ఆమె మెడికల్ హిస్టరీ వంటి వాటి ఆధారంగా ఈ నిర్ణయం చేస్తారు. యోని జననం కంటే కూడా సిజేరియన్ చేయాలనే దానికి కొన్ని కారణాలుగా దిగువ అంశాలు చెప్పవచ్చు.
బేబీకి సంబంధించిన అంశాలు -
బేబీకి గుండె అతిగా కొట్టుకోవడం, గర్భాశయంలో బేబీ సరైన భంగిమలో లేకపోవటం, హైడ్రోసిఫలస్ లేదా స్పైనా బిఫిదా సమస్యలు, లేదా గర్భాశయంలో ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు వుండటం.
తల్లికి సంబంధించిన అంశాలు -
యోని సంబంధిత ఇన్ ఫెక్షన్లు
గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు
తల్లి హెచ్ ఐవి ఇన్ ఫెక్షన్ కలిగి వుండుట
గర్భాశయానికి గతంలో సర్జరీ లేదా సిజేరియన్లు జరిగి వుండట.
తల్లికి తీవ్ర గుండె లేదా ఇతర వ్యాధులు కలిగి వుండుట.
కాన్పు సమయంలో బేబీ తల పెద్దదిగా వుండి తల్లి కటి ప్రదేశంనుండి బయటకు రాలేకపోవుట
దీర్ఘకాల కాన్పు నొప్పులు
బేబీ సైజు పెద్దదిగా వుండుట
బోడ్డుతాడు సమస్యలు మొదలైన వాటి కారణంగా తల్లి మరియు బిడ్డ భధ్రతలకు గాను సిజేరియన్ ఆపరేషన్ చేస్తారు. సిజేరియన్ సర్జరీ సురక్షితమైన విధానమే. సమస్యలు చాలా తక్కువగానే వుంటాయి. అయితే, సిజేరియన్ ఆపరేషన్ తర్వాత చాలా జాగ్రత్తగా వుండాలి. యోని సంబంధిత ఇన్ ఫెక్షన్లు, మూత్రాశయ సమస్యలు, బేబీకి గాయం కలగటం వంటివి వుండే అవకాశాలుంటాయి.
యోని ద్వారా జననం మహిళకు బిడ్డ జననం తర్వాత ఎటువంటి సమస్యలను కలుగనీయదు. సిజేరియన్ కంటే కూడా యోని జననం మెరుగైనది. కాని నేటి రోజులలో మహిళలు కాన్పుల కష్టం తెలియకుండా, నెలలు నిండగానే సిజేరియన్ ఆపరేషన్లతో బిడ్డలను కని ఆనందించేస్తున్నారు. వైద్య రంగం బాగా అభివృద్ధి చెందిన కారణంగా సమస్యలు కూడా వీరికి అతి తక్కువగా వుంటున్నాయి. కనుక మహిళ మరియు వైద్యులు అత్యవసరమని భావిస్తే, బిడ్డ జననం చాలా వరకు సిజేరియన్లతో సౌకర్యవంతంగా జరుగుతూనే వున్నాయి.



Click it and Unblock the Notifications